Overeating Mangoes : మామిడి పండ్లను అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!
ABN, Publish Date - May 17 , 2024 | 10:45 AM
పోషకాలు అధికంగా ఉండే మామిడి పండును మరీ ఎక్కువగా తిన్నా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ పండులో అలెర్జీని కలిగించే గుణం ఉంది. తీపి రుచి కలిగిన మామిడి పండు అతిగా తీసుకుంటే అజీర్ణ సమస్యలు కలుగుతాయి. వ్యాధులు, స్ట్రోకులు కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. మామిడి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధంగా అలెర్జీని కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు కలిగే అవకాశం ఉంది. చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంది.
మామిడి పండ్లు రుచికరమైనవి, వీటి తీపి రుచికి అంతా మామిడి పండ్లను తప్పక తినేందుకు ఇష్టపడతారు. అయితే మంచి వేసవిలో మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. ఈ ఎండల్లో పండ్లను తినడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటంటే..మామిడి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండులోని పొటాషియం అధికంగా ఉండే సోడియంను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పోషకాలు అధికంగా ఉండే మామిడి పండును మరీ ఎక్కువగా తిన్నా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ పండులో అలెర్జీని కలిగించే గుణం ఉంది. తీపి రుచి కలిగిన మామిడి పండు అతిగా తీసుకుంటే అజీర్ణ సమస్యలు కలుగుతాయి. వ్యాధులు, స్ట్రోకులు కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. మామిడి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధంగా అలెర్జీని కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు కలిగే అవకాశం ఉంది. చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంది.
మామిడి పండ్లలో అనేక రకాల్లో ఫైబర్ జీర్ణక్రియకు సహకరిస్తుంది. అయితే అన్ని పండ్లలోనూ ఫైబర్ ఎక్కువగా ఉండదు. ఈ పండ్లను అధికంగా తినడం వల్ల కలిగే మరో సమస్య బరువు పెరగడం. అదే పనిగా మామిడిపండ్లను తీసుకుంటే బరువు పెరుగుతారు.
జుట్టు, గోళ్లు పెరుగుదలకు బయోటిన్ ఎంత వరకూ అవసరం..!
నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడిని అధికంగా తీసుకోవడం వల్ల జిఐ డిస్ట్రెస్ కు దారితీయవచ్చు. ఎందుకంటే ఇందులో పులియబెట్టే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది ఐబిఎస్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమమ్ ని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - May 17 , 2024 | 10:45 AM