ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Poor Sleep : రాత్రిపూట సరిగా నిద్రలేకపోతే కనిపించే సంకేతాలు ఎలా ఉంటాయంటే..

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:24 PM

శరీరానికి నిద్ర చాలా అవసరం. ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోతే మరుసటి రోజంతా గందరగోళంగా మారిపోతుంది. శరీరం అలసటగా, ఉత్సాహం లేనట్టుగా మారుతుంది. మరీ నీరసంగా మెదడు మొద్దుబారినట్టుగా మారుతుంది.

Sleep

శరీరానికి నిద్ర చాలా అవసరం. ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోతే మరుసటి రోజంతా గందరగోళంగా మారిపోతుంది. శరీరం అలసటగా, ఉత్సాహం లేనట్టుగా మారుతుంది. మరీ నీరసంగా మెదడు మొద్దుబారినట్టుగా మారుతుంది. అయితే నిద్ర సరిగా లేదనే విషయంలో సంకేతాలు ముందుగా ఈ లక్షణాలతో పాటు చర్మంలో ఆ సంకేతాలు తెలుస్తాయి. అదెలాగంటే.. నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. శరీరం అనేక విభిన్న సమస్యలకు కారణం అవుతుంది.

కళ్ళు మసకబారినట్టుగా..

ఎరుపు, ఉబ్బడం, నల్లటి వలయాలు, ఉబ్బినట్టుగా బ్యాగులు ఇలా కళ్ళలో తేడా కనిపిస్తుంది. నిద్రలేమి కారణంగా ముడతలు, చర్మం పాలినట్టుగా ఉండటం ఉంటుంది. అలాగే హార్మోన్ నియంత్రణ, కణజాల మరమ్మత్తును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.

నిద్రలేమితో బరువు..

మంచి నిద్ర శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అదే సరిగా నిద్రపోకపోతే మాత్రం ఆకలితో పాటు హార్మోన్ల మార్పులతో తినాలనే కోరిక పెరిగి బరువు ఇట్టే పెరుగుతారు.

జంక్ ఫుడ్..

నిద్రలేమితో సలాడ్, చీజ్ బర్గర్, ఫ్రైల మీదకు పోతుంది మనసు, నిద్రలేమి మెదడును అనారోగ్యానికి గురిచేస్తుంది. అలసిపోయినట్టుగా చేసి బయటి ఫుడ్స్ తినేలా ప్రేరేపిస్తుంది.


Health Tips : టీ, కాఫీలకు బదులుగా ఎన్ని తెలుసా.. వీటిని తీసుకుంటే..

కెఫీన్

కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, టీ, కాఫీలకు అలవాటు పడటం వల్ల నిద్ర సమస్యగా మారుతుంది. ఇది ఎక్కువకాలం ఉంటే కనుక నిద్రలేమి స్థిరంగా ఉండిపోతుంది.

మూడ్స్ ఛేంజ్..

చికాకు, విసురు, కుదురుగా ఉండలేకపోవడం వంటివి నిద్రలేమితో మొదలవుతాయి. దీనితో మూడ్స్ మారుతూ ఉంటాయి. మానసికంగా అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది.


Eye Health : కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..?

డిప్రెషన్ ఉంటుంది.

డిప్రెషన్, నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఉంటుంది. ఈ పరిస్థితి కాస్త ఇబ్బంది కరమైనదే. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎక్కువ సమయం నిద్రపోతేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దానితో ఉత్సాహంగా ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 07 , 2024 | 12:29 PM

Advertising
Advertising