ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Skin Health : విటమిన్ సి వాడిచూడండి దీనితో చర్మానికి నిగారింపు ఖాయం..!

ABN, Publish Date - Jul 08 , 2024 | 04:36 PM

విటమిన్ సి చర్మం నీటిని నిలుపుకోవటానికి తేమగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది చర్మం కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడంలో సహయపడుతుంది.

skin care

చర్మాన్ని వాతావరణానికి తగినట్టుగా రక్షించుకోవాలంటే చాలా కేర్ అవసరం. దీనికోసం సమయాన్ని కేటాయించాలి. దీనికోసం సరైన బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ సి అనేది చర్మంలో సహజంగా లభించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది పర్యావరణ కాలుష్యాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. హెల్త్ కేర్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మరిన్నింటిని చూద్దాం.

విటమిన్ సి వాడకం వల్ల స్కిన్ టోన్ ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇది నల్ల మచ్చలను నయం చేస్తుంది. విటమిన్ వాడకం మెలనిస్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలనిన్ చర్మం రంగుకు సహకరిస్తుంది. విటమిన్ సి కారణంగా మెలనిన్ చర్మం రంగును పెంచుతుంది.

విటమిన్ సి చర్మం నీటిని నిలుపుకోవటానికి తేమగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది చర్మం కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడంలో సహయపడుతుంది. విటమిన్ సి లోపం ఉంటే గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.

కాలుష్యం కారణంగా ఆక్సీకరణ ఒత్తిడికి గురికావడం వల్ల చర్మంలో విటమిన్ సి స్థాయిలు తగ్గుతాయి.

Tooth Brushes : మనం వాడే టూత్ బ్రష్‌ను ఎంత కాలానికి మార్చాలి..!


దీనితో ఇబ్బందులు కూడా ఉంటాయి.

విటమిన్ సి సాధారణంగా ఉపయోగించడానికి సురక్షితమైనది. చర్మ సంరక్షణలో అధిక సాంద్రతలలో ఉపయోగించనట్లయితే దురద, ఎపురు, పొట్టు వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. విటమిన్ సి చర్మాన్ని సూర్యరశ్మికి కూడా తట్టుకోనంత సున్నితంగా చర్మ తత్వాన్ని మారుస్తుంది. అందుకోసం సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం ముఖ్యం.

విటమిన్ సి, సీరమ్, క్రీమ్, లోషన్లలో ఉంటుంది. చర్మం ముడతలను తగ్గించడంలో విటమిన్ సి ముఖ్యంగా పనిచేస్తుంది.

చర్మం మృదువుగా, యవ్వనంగా ఉండటానికి హైడ్రేటెడ్ చర్మం అవసరం. విటమిన్ సి ప్రయోజనాలలో చర్మం తేమ నిలిచేందుకు ఉపయోగపడుతుంది. కేవలం 15 నిమిషాల్లో చర్మం మంచి హైడ్రేట్ గా కనిపిస్తుంది. విటమిన్ సి షీట్ మాస్క్ ని వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 08 , 2024 | 04:36 PM

Advertising
Advertising
<