Health Tips : వెల్లుల్లి తీసుకుంటే శరీరానికి ఇన్ని లాభాలా..!
ABN, Publish Date - Jun 13 , 2024 | 12:10 PM
కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ LDL తక్కువ ప్లాస్మా సాంద్రతను నిరోధిస్తుంది.
కాస్త ఘాటుగా ఉండే వెల్లుల్లితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతి వంటకానికి వెల్లుల్లి ప్రత్యేకమైన రుచిని తెస్తుంది. మసాలాగా వెల్లుల్లికి మంచి పేరుంది. అయితే ఆరోగ్యపరంగా వెల్లుల్లి చెక్కరను కంట్రోల్లో ఉంచుంతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇంకా వెల్లుల్లితో ఎన్ని లాభాలంటే ..
రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. మధుమేహం ఉన్న చాలా మందికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి, గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేస్తే ఇది శరీరంలో మధుమేహాన్ని అదుపులోకి తెస్తుంది. అలాగే గుండె అడ్డంకులను తొలగిస్తుంది.
కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ LDL తక్కువ ప్లాస్మా సాంద్రతను నిరోధిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని వేగవంతం చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. లిపోప్రోటీన్ HDL మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
Mint Leaves : పుదీనా ఆకులతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఇవే ..!
వెల్లుల్లి ఆహారంలో..
పచ్చి వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల యాక్టివ్ సమ్మేళనాలను మరింత సహజంగా, విభిన్నంగా తీసుకోవడానికి వీలవుతుంది.
వెల్లల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. విటమిన్లు బి1, బి2, బి3, బి6, పోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం వంటి సమ్మేళనాలున్నాయి.
Mango seeds : మామిడి కాయలు తిని టెంకలు పారేస్తున్నారా? వీటితో ఎన్ని లాభాలో తెలుసా..!
ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని నీళ్ళు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయి. వెల్లుల్లి రోజూ తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
వెల్లుల్లి తింటే లివర్, మూత్రాశయం పనితీరు మెరుగు పరుస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 13 , 2024 | 12:11 PM