ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Super Food : రోజూ ఆహారంలో బెర్రీస్ తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..!

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:55 PM

బ్లాక్బెర్రీస్ విటమిన్ సి కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరాన్ని అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

Health Benefits

సీజన్ వారీగా దొరికే చాలా పండ్లలో బోలెడు పోషకాలుంటాయనేది అందరికీ తెలిసింది. మనం తక్కువగా తినే చాలా వాటిలో కూడా బోలెడు పోషకాలుంటాయి. బెర్రీస్ ఎప్పుడోకానీ తినే పండుకాదు. కాకపోతే ఈ పండ్లలో అనేక పోషకాలున్నాయి. బ్లాక్బెర్రీస్ నల్లగా ద్రాక్షగుత్తులను పోలి ఉండే ఈ నల్ల పండ్లు మంచి రుచితోపాటు అనేక పోషకాలకు నిలయం. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, అవసరమైన విటమిన్లుతో నిండి ఉన్నాయి. ఈ రుచికరమైన పండ్లు మంచి సువాసనను కలిగి ఉంటాయి. వీటిని తింటే..

బ్లాక్బెర్రీస్, మనం తినే సూపర్ ఫుడ్స్‌లో ఒకటి. ఆరోగ్యప్రయోజనాల విషయానికి వస్తే ఆకరంలో చిన్నవైనా, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ విషయానికి వస్తే మంచి శక్తివంతమైన ఆహారం ఇది. రోజువారి ఆహారంలో బ్లాక్ బెర్రీస్ చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవి..

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

బ్లాక్ బెర్రీస్ విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ తో సహా యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి. ఈ శక్తివంతమైన సమ్మేళనాలు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్లాక్ బెర్రీస్ తీసుకోవడం వల్ల సెల్యులర్ డ్యామేజ్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.


Sleeping Risk : నిద్ర సరిగా లేకపోతే గుండె సమస్యలు తప్పవా..!

బ్లాక్బెర్రీస్ విటమిన్ సి కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరాన్ని అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ సీజన్ లో ఆహారంలో బ్లాక్ బెర్రీలను చేర్చుకోవడం వలన రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

Over Thinking : మరీ ఆలోచిస్తే ఇబ్బంది తప్పదా.. ఆలోచన మానుకోవాలంటే.. !

చర్మానికి కూడా మంచి నిగారింపును ఇస్తుంది. వృద్ధాప్య ఛాయలను రానీయకుండా చేస్తుంది. చర్మాన్ని రక్షించడం, మేలు చేయడం చేస్తుంది. విటమిన్ సి, కొల్లాజెన్, సంశ్లేషమలో కీలకపాత్ర పోషిస్తుంది. బ్లాక్ బెర్రీస్ కాంతివంతమైన ఛాయను అందిస్తుంది. మొటిమలు, తామర వంటి చర్మ ఇబ్బందులనుంచి కాపాడుతుంది.

బ్లాక్ బెర్రీస్ ఫ్లేవనాయిడ్స్ సమ్మేళనాలున్నాయి. ఇవి న్యూరోప్రోటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉంది. మెదడు ఆలోచనను మెరుగుపరుస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఈ బెర్రీస్ లో కె విటమిన్ ఉంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇది మూలం. విటమిన్ కె, ముఖ్యంగా పనిచేస్తుంది. పగుళ్ళు, బోలు ఎముక వ్యాధి ఇలా చాలా వాటిని నయం చేస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 16 , 2024 | 03:55 PM

Advertising
Advertising
<