ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drinking Hot Water : వేడి నీటిని తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..

ABN, Publish Date - Jul 10 , 2024 | 01:18 PM

వేడినీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలలో జీర్ణ వ్యవస్థకు రక్తప్రసరణను పెంచడంలో, జీర్ణ అవయవాలను ఉత్తేజపరచడంలో మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

Drinking Hot Water

బాగా దాహంగా అనిపిస్తే చల్లని నీటిని గడగడా తాగేస్తాం. శరీరానికి తగినంత నీరు తాగడం అవసరం. చల్లటి నీటి కంటే కూడా కాస్త గోరువెచ్చని నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు అనేకం. వేడి నీరు జీవ క్రియను పెంచుతుంది. అలాగే శరీరంలో నొప్పిని తగ్గిస్తుంది. విశ్రాంతిని ఇస్తుంది. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి.

వేడినీరు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల..

1. జలుబు సమస్య తీరుతుంది. సైనస్ ఇబ్బంది నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు వేడి నీరు సహకరిస్తుంది.

3. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

Super Snacks : వర్షాకాలం ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!

4. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

5. చల్లని వాతావరణంలో శరీరం వెచ్చగా ఉండే విధంగా చేస్తుంది.

6. ఒత్తిడిని తగ్గించడంలో కూడా వేడి నీరు సహకరిస్తుంది.

7. బరువు తగ్గడంలో సహకరిస్తుంది.


Vitamin B6 : మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి6 ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే..!

8. దంతాల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

9. వేడినీరు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

10. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా వేడి నీరు సహకరిస్తుంది.

వేడినీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలలో జీర్ణ వ్యవస్థకు రక్తప్రసరణను పెంచడంలో, జీర్ణ అవయవాలను ఉత్తేజపరచడంలో మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. వేడి నీరు ఆహారాన్ని త్వరగా అరుగుదలకు ప్రేరేపిస్తుంది. శరీరం పోషకాలను త్వరగా గ్రహించేలా చేస్తుంది. మలబద్దకం, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

Tooth Brushes : మనం వాడే టూత్ బ్రష్‌ను ఎంత కాలానికి మార్చాలి..!

వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో శరీరం ఎక్కువ ద్రవాలను కోల్పోయే సమయంలో వేడినీరు మంచి ద్రవంగా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 10 , 2024 | 02:55 PM

Advertising
Advertising
<