Black salt : నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా? ఈ నీటిని తాగితే..
ABN, Publish Date - Jun 11 , 2024 | 12:35 PM
బ్లాక్ సాల్ట్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. తక్కువ సోడియం స్థాయిలుంటాయి. ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలుంటాయి.
మనం తినే ఆహారంలో ఉప్పు లేకపోతే భోజనం రుచిగా ఉండదు. అస్సలు తినలేం కూడా. అయితే తినే ఆహారంలో ఉప్పు అనేది ఓ భాగం అయిపోయింది. ఉప్పు అనగానే తెల్లగా మెరిసిపోతూ కనిపించే తెలుపే కాదు, నల్లగా ఉండే ఉప్పు కూడా ఆరోగ్యానికి మంచిదే. నల్ల ఉప్పును పాత కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. సముద్ర నీళ్లను ఆవిరి చేసి ఈ ఉప్పును తయారు చేస్తారు. ఇందులో సోడియం క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ ఉన్నాయి. ఈ ఉప్పు వాడటం వల్ల వంటకాలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ ఉప్పుతో...
1. నల్ల ఉప్పుతో శరీరం చల్లగా ఉంటుంది. వ్యాధులను తగ్గిస్తుంది.నల్ల ఉప్పుతో లాక్సేటివ్ గుణాలున్నాయి. ఇవి మెటబాలిక్ రేటును పెంచుతాయి. కడుపు క్లీన్ అవుతుంది.
2. నల్ల ఉప్పు లివర్ ను డిటాక్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నల్ల ఉప్పు లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీనితో సురక్షితంగా ఉంటుంది.
Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా వదిలించుకోవాలి. ఆయుర్వేదంలో దీనికి పరిష్కారం ఉందా?
3. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు నల్ల ఉప్పు సహకరిస్తుంది.
4. దీనితో జీర్ణాశయం శుభ్రమవుతుంది.
5. ఫైల్స్ ఉన్నవారికి దీనితో ఉపశమనం కలుగుతుంది. అసిడిటీ సమస్య తగ్గుతుంది.
6. బ్లాక్ సాల్ట్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. తక్కువ సోడియం స్థాయిలుంటాయి. ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలుంటాయి.
Health Benefits: కాల్షియం, విటమిన్ డి క్యాప్సూల్స్ వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
గుండెల్లో మంట, ఉబ్బరం తగ్గుతుంది.
నల్ల ఉప్పు కాలేయంలో పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గుండెల్లో మంట, ఉబ్బరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాసిడ్ స్థాయిలను పరిమితం చేస్తుంది.
జీర్ణక్రియ..
జీర్ణక్రియ సమస్యలకు కాలేయం పిత్తాన్ని తయారు చేయడంలో చిన్న ప్రేగులలో శరీరంలోని కొవ్వులో కరిగే విటమిన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్..
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొద్దిగా తగ్గించడంలో బ్లాక్ సాల్ట్ సహాయపడుతుంది.
నల్ల ఉప్పు నీళ్ళను తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గుండెల్లో మంట అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. ఈ నీటిని ప్రతీరోజూ తీసుకోవాలంటే ఇందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఈ నీరు అందరికీ సెట్ కాకపోవచ్చు. డాక్టర్ సలహా మీద తీసుకోవడం మంచిది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 11 , 2024 | 12:35 PM