ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Benefits : గుండె ఆరోగ్యాన్ని పెంచే సోరెల్ ఆకుకూర ఎంత గొప్పదంటే..!

ABN, Publish Date - May 10 , 2024 | 03:34 PM

సోరెల్‌లో గుండె ఆరోగ్యానికి అవసరమైన పోటాషియం, మెగ్నీషియం వంటి సమ్మేళనాలున్నాయి. పోటాషియం, సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని మెగ్నీషియం కండరాల పనితీరుకు సహకరిస్తుంది.

health benefits.

కూరలు, పండ్లు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. వీటిలో పోషకాలు, విటమిన్స్ అధికంగా ఉంటాయని మనకు తెలుసు. అయితే వీటిలో పచ్చని ఆకుకూరలు ఇంకా మంచివి. వీటిని తాజాగా తీసుకుంటే మరింత ఆరోగ్యం మనదవుతుంది. ఆకుకూరలు రక్తం పెరిగేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు, కళ్ల ఆరోగ్యానికి మంచివి. జీర్ణక్రియను కూడా ఇవి పెంచుతాయి.

మన తోట కూర, పాల కూరలానే సోరెల్ ఆకు కూర కూడా చాలా మంచి పోషకాలను కలిగి ఉంది. దీనిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

పోషకాహార ప్రపంచంలో కొన్ని ఆకుకూరలు చాలా శక్తిని ఇచ్చేవిగా ఉన్నాయి. అందులో మనకు తెలిసిన కూరల్లో ముఖ్యంగా సోరెల్ చాలా పోషకాలతో నిండి ఉంది. మంచి కమ్మని రుచిని కూడా ఇస్తుంది. ఇంకా ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అందుతాయంటే..

నువ్వుల్ని ప్రతిరోజూ తీసుకుంటే నోటి శుభ్రతను పెరుగుతుందా .. !

యాంటీ ఆక్సిడెంట్లు..

క్వెర్సెటిన్, ఆంథోసైనిన్స్ వంటి ఫ్లేవనాయిడ్ లతో సహా యాంటీ ఆక్సిడెంట్లు సోరెల్లో ఉన్నాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, మంటను తగ్గిస్తాయి. ఫ్రీరాడికల్స్ తో కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ లనుంచి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడతాయి.

జీర్ణ ఆరోగ్యానికి..

సోరెల్లోని ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. సోరెల్ ఆక్సాలిక్ యాసిడ్ సమ్మేళనాలతో ఉంటుంది. ఇది మొత్తం జీర్ణ క్రియకు మేలు చేస్తుంది. అజీర్ణం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.


Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

రోగనిరోధక పనితీరు..

విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్‌తో పాటు విటమిన్లు, ఖనిజాల సంపదతో సోరెల్ రోగనిరోధక పనితీరుకు మంచి సపోర్ట్ ఇస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

సోరెల్‌లో గుండె ఆరోగ్యానికి అవసరమైన పోటాషియం, మెగ్నీషియం వంటి సమ్మేళనాలున్నాయి. పోటాషియం, సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని మెగ్నీషియం కండరాల పనితీరుకు సహకరిస్తుంది. సమతుత్య ఆహారాన్ని తీసుకోవాలనుకునేవారు సోరెల్ ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 10 , 2024 | 03:34 PM

Advertising
Advertising