ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!

ABN, Publish Date - Apr 30 , 2024 | 12:57 PM

వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే దాహం తీరే మార్గాన్ని వెతగ్గానే కూల్ డ్రీంక్స్ మీదకే పోతుంది మనసు. కానీ అందరూ డ్రింక్స్ తాగలేరు. ముఖ్యంగా డయాబెటీస్ తో ఉన్నవారు డ్రింక్స్ జోలికి పోకూడదు. ఇలాంటి వారు ప్రత్యేకంగా వేసవిలో తీసుకోవాల్సిన పానీయాల విషయానికి వస్తే..

Diabetes

వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే దాహం తీరే మార్గాన్ని వెతగ్గానే కూల్ డ్రీంక్స్ మీదకే పోతుంది మనసు. కానీ అందరూ డ్రింక్స్ తాగలేరు. ముఖ్యంగా డయాబెటీస్ తో ఉన్నవారు డ్రింక్స్ జోలికి పోకూడదు. ఇలాంటి వారు ప్రత్యేకంగా వేసవిలో తీసుకోవాల్సిన పానీయాల విషయానికి వస్తే.. కొన్ని పానీయాలను మాత్రమే తీసుకోగలుగుతారు. అందులో

చక్కెర లేకుండా నిమ్మరసం..

నిమ్మకాయలు, కాసింత నీరు, ఐస్ క్యూబ్స్, కాసిని పుదీనా ఆకులు, మాంక్ ఫ్రూట్ స్వీట్నెర్ కలిపి చేసే జ్యూస్ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక పనితీరును మెరుగు పరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. నిమ్మరసం విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

వేసవిలో మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?

మజ్జిగ..

సాదా పెరుగులో రుచికి ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి తయారు చేయాలి. ఇది తాగినపుడు కడుపులో చల్లని ఫీలింగ్ కలుగుతుంది. మజ్జిగ చెమట రూపంలో కోల్పోయిన ద్రవాలను శరీరంలో తిరిగి నింపుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి నుంచి రిలీఫ్ ఇస్తుంది. మజ్జిగలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.


జిల్ జీరా..

జీరా పౌడర్, నీరు, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర ఆకులు, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వీటితో కలిపి చేసే డ్రింక్ వేడి వాతావరణంలో హైడ్రేట్ గా ఉంచుతుంది. వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీలకర్ర, ఉప్ప జీర్ణక్రియకు సహకరిస్తాయి. ఆకలిని క్రమం చేసి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. నిమ్మరసం, జీలకర్ర వంటి కొన్ని పదార్థాలు శరీరాన్ని రీఫ్రెష్ చేస్తాయి.

ఈ చిట్కాలతో రాత్రిపూట మంచి నిద్ర ఖాయం.. ట్రై చేసి చూడండి..!

సత్తు పానీయం..

సత్తు పిండి, నీరు, ఉప్పు, జీలకర్ర పొడి, ఐస్ క్యూబ్స్, నిమ్మరసం, పుదీనా ఆకులు ఇది వేడి నుంచి రక్షణగా నిలుస్తుంది. రిఫ్రెష్ పానీయంగా సత్తు పానీయం పనిచేస్తుంది. బరువు పెరుగకుండా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. సత్తులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, సోడియం చెమట ద్వారా పోయిన ఎలక్ట్రోలైట్ లను తిరిగి నింపుతాయి.


కోకుమ్ షెర్బత్..

కోకుమ్ పండు, నీరు, ఎరిథ్రిటాల్, ఉప్పు, జీలకర్ర పొడి, ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులు, వేసవిలో వేడిని రిఫ్రెష్ పానీయంగా మారుతుంది. కోకుమ్ షెర్బెట్ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది,. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 30 , 2024 | 12:59 PM

Advertising
Advertising