ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ashwagandha : అశ్వగంధ గురించి తెలుసా... ఒత్తిడిని తగ్గించడంలో దీనికి సాటి మరేదీ లేదు..!

ABN, Publish Date - Mar 18 , 2024 | 01:12 PM

ఇది అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది.

Ashwagandha

ఈ మూలిక మన శారీరక రుగ్మతలను నయం చేయడమే కాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అశ్వగంధతో ముడిపడి ఉన్న కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

చర్మసౌందర్యానికి, చర్మ రుగ్మతలకు (Ashwagandha benefits for skin)

శుభ్రమైన, మృదువైన చర్మం కావాలనేవారికి.., చిన్నవయసులోనే ముసలివారికుండే విధంగా ముడతలు పడే చర్మం రావడాన్ని అశ్వగంధ నివారిస్తుంది.

కేశ (జుట్టు) ప్రయోజనాలకోసం (Ashwagandha for hair)

అశ్వగంధలో ఉండే యాంటీఆక్సిడెంట్, పోషకగుణాలు జుట్టుకు మంచి టానిక్ లాగా పని చేస్తుంది. అశ్వగంధ జుట్టుకుదుళ్లనుకు బలాన్ని చేకూరుస్తుంది. నిత్యం అశ్వగంధను సేవిస్తే శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది, దీనితో జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

మహిళలకు (Ashwagandha benefits for women)

అశ్వగంధ స్త్రీలలో రుతు సమయంలో కలిగే ఒత్తిడి, చికాకు, ఆందోళన హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఈ చేప పిల్లల్ని తన నోటిలో ఎందుకు దాస్తుందో తెలుసా...!

పురుషులకు (Ashwagandha benefits for men)

పురుషులలో సంతానోత్పత్తి శక్తిని పెంచడానికి ఉపయోగించే ప్రధాన మూలికల్లో అశ్వగంధ కూడా ఒకటి. అశ్వగంధను ప్రతినిత్యం సేవించడం వల్ల పురుషుల్లో లైంగిక ధారుఢ్యం పెరగడమే కాకుండా వీర్యకణాలను పెంచుతుంది. ఇది, వృషణాల్లో “టెస్టోస్టెరోన్” అనే హార్మోన్ల స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మంచి విశ్రాంతనిద్ర కోసం(Ashwagandha for a restful sleep)

అశ్వగంధ ఇది ఒత్తిడిని, కలతను, ఆందోళనను, నొప్పిని, పోగొట్టే మూలికా ఔషధం, దీనిని సేవిస్తే మంచి నిద్రను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!

ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!

యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!


ఉపయోగాలు..

1. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: అశ్వఘంధ అనేది అడాప్టోజెన్ (adaptogen). ఇది ఒత్తిడి, నిరాశ, ఆందోళనను తగ్గించడానికి, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఒత్తిడి సంబంధిత సమస్యలను నిరోధించడానికి సహాయం చేస్తుందని కనుగొనబడింది. ముధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

2. ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది: దానికి సమర్థవంతమైన వాపు వ్యతిరేక చర్యలు ఉండడం వలన, అశ్వఘాంధ కీళ్ళ నొప్పిని, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది పిత్తను సమతుల్యం చేస్తుంది.

3. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది: ఇది అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది.

4. గాయాలు నయం కావడాన్ని ప్రోత్సహాహిస్తుంది: ప్రీక్లినికల్ పరిశోధనలలో అశ్వగంధాను ఓరల్‌గా ఇచ్చినప్పుడు అది గాయాన్ని తగ్గించే ప్రక్రియను వేగవంతం చేసింది.

5. మంచి నిద్రను అందిస్తుంది: ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం ద్వారా, అశ్వగంధ మెదడును శాంతపరచి మంచి నిద్రను అందిస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 01:15 PM

Advertising
Advertising