ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Light colors in summer : వేసవిలో లేత రంగులు ఎందుకు.. వీటితో వేడి నుంచి తప్పించుకోవచ్చా..!!

ABN, Publish Date - Apr 17 , 2024 | 01:30 PM

లేత రంగు దుస్తులను ధరించడం వల్ల సూర్యరశ్మి ఎక్కువగా నిలవదు. ఇది వేడికి సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మరోవైపు చల్లగా ఉన్న రోజున ముదురు రంగు దుస్తులను వేసుకోవచ్చు. చల్లని రోజులలో ముదురు రంగు దుస్తులు వేడిని గ్రహిస్తాయి. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి.

colors and natural fabrics

వేసవి (summer) కాలం వచ్చిందంటే దానితోనే ఎండ, వేడి, ఉక్కపోతా ఉంటాయి. చమట కారణంగా వేసుకున్న దుస్తులు చిరాగ్గా అనిపిస్తాయి. కాస్త కాటన్ వంటి దుస్తుల వల్ల ఉపశమనంగా ఉంటుంది. కానీ ధరించే దుస్తులు ఎండలో లేత రంగులైతే వేడి తక్కువగా ఉంటుందని అంటారు. వేసవి వేడి ఎక్కువగా ఉన్నందున, తేలికపాటి దుస్తుల వేసుకుంటూ ఉంటాం. తేలికపాటి రంగులు, సహజ దుస్తులు వేడిలో ఎందుకు మెరుగ్గా పనిచేస్తాయో తెలుసా? నార, పత్తి సహజ ఫైబర్స్ చెమటను గ్రహిస్తాయి, చర్మం చమటను పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది.. ఉదాహరణకు, పాలిస్టర్, చర్మంపై తేమను బంధిస్తుంది, ఇది వేడిగా అసౌకర్యంగా ఉంటుంది. వేసవిలో ధరించగలిగే రంగులు చాలా ఉన్నాయి, కానీ కొన్ని మిగతావాటికన్నా మెరుగ్గా ఉంటాయి. ప్రత్యక్ష సూర్యకాంతిలో బయట ఉన్నప్పుడు, ఇతర రంగుల కంటే తెలుపు వేడిని బాగా ప్రతిబింబిస్తుంది. అసలు ఇది ఎంత వరకూ నిజం. తెలుసుకుందాం.

వేసవిలో(summer) సూర్యకాంతి తీవ్రత ఎక్కువ. ఈ కాలంలో ప్రత్యేకంగా తేలికపాటి దుస్తులు ధరించడం మంచిది. లేత రంగు దుస్తులను ధరించడం వల్ల సూర్యరశ్మి ఎక్కువగా నిలవదు. ఇది వేడికి సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మరోవైపు చల్లగా ఉన్న రోజున ముదురు రంగు దుస్తులను వేసుకోవచ్చు. చల్లని రోజులలో ముదురు రంగు దుస్తులు వేడిని గ్రహిస్తాయి. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఇలా చేస్తే చలి నుంచి ఉపశమనం పొందుతారు. వేసవిలో మాత్రం కాటన్, షిఫాన్, జార్జెట్, క్రీప్ వంటి సన్నని, తేలికపాటి దుస్తులను ధరించండం శరీరానికి మేలు.


కాటన్ పిల్లలకి, పెద్దలకి కాస్త సౌకర్యంగా ఉండే ఫేబ్రిక్..

1. వేసవిలో మహిళలకు అత్యంత సౌకర్యవంతమైన దుస్తులు చీర. చాలా వరకూ పెళ్ళయిన స్త్రీలు.. వేసవిలో కాటన్ చీరలు కట్టుకోవడం వీలుగా భావిస్తారు.

2. ఎండాకాలం వల్ల మన శరీరంలోంచి వెలువడే చెమటను కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది.

Sleep disorder : నిద్రలేకపోవడం వల్ల కలిగే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు..

3. కాలానికి తగినట్టుగా దుస్తులు వేసుకోవడం ముఖ్యంగా తెలుపు దుస్తులు వేసుకోవడం అలాగే కాటన్, ఖద్దర్ ప్రశాంతతకు ప్రతీకగా ఉంటాయి.

4. ఇది సూర్యుని నుండి విద్యుత్ వాహకం వలె పనిచేస్తుంది. మన శరీరంలోకి వేడిని విడుదల చేయదు. ఇది వేడిని బయటకు పంపి, గాలిని లోపలికి లాగుతుంది.

5. వేసవిలో కొంతమందికి సింథటిక్, పాలిస్టోర్ వంటి బట్టలు వేసుకోవడం వల్ల చర్మం దురదగా ఉంటుంది.

మంచి జీర్ణ ఆరోగ్యానికి వేసవిలో తీసుకోవాల్సిన డ్రింక్స్ ఇవే..

6. కానీ కాటన్ అలా కాదు. దీనివల్ల చర్మం దురద లేదా చర్మ వ్యాధులు రావు. అన్ని శరీర రకాలకు తగిన దుస్తులు.

7. ఎలాంటి వాతావరణంలోనైనా శరీరాన్ని రక్షించే సత్తా కాటన్ వస్త్రాలకు ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 17 , 2024 | 01:31 PM

Advertising
Advertising