Health Benefits : షుగర్ ఉన్నవారికి జామకాయలే కాదండోయ్ జామ ఆకులతో కూడా బోలెడు ఉపయోగాలు..
ABN, Publish Date - Jul 06 , 2024 | 04:42 PM
జామ ఆకుల రసాన్ని కషాయం రూపంలో తీసుకున్నా, లేదా ఆకులను పచ్చిగా నమిలినా కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.
జామకాయలు వేసివి ముగిసి కాస్త వర్షాలు మొదలవగానే ఎక్కడ చూసినా జామకాయల బుట్టలే కనిపిస్తాయి. మామిడి కాలం అయిపోగానే నేరేడుపండ్లు, జామకాయలు అందుబాటులోకి వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు తినగలిగిన పండ్లలో జామకాయ కూడా ఒకటి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. షుగర్ ఉన్నవారు జాయ కాయలనే కాదు ఆకులను తిన్నా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మధ్యకాలంలో జామఆకులను ఆరబెట్టి, పొడి చేసి ఎగుమతిచేస్తున్నారు. ఈ పొడిని వేడి నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం ఎక్కువైంది. దీనితో అనేక ప్రయోజనాలు అందుతాయట. ఇంకా..
డయాబెటిస్ లో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో జామ ఆకులు సహకరిస్తాయి. ఈ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, పాలీఫెనాల్స్ వంటి డయాబెటీస్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
మధుమేహానికి జామ ఆకులు..
జామ ఆకుల టీ తయారు చేయాలంటే 1కప్పు నీటిలో రెండు ఆకులను వేసి లేదా స్పూన్ జామ ఆకుల పొడిని వేసి మరిగించాలి. ఇది మరిగిన తర్వాత వడగట్టి ఉదయం పూటు మధుమేహం ఉన్నవారు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ టీని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
Ashada masam : ఆషాఢానికి అంత ప్రత్యేకత ఎందుకు? ఈ మాసంలో ఆ ఆకుకూరలనే ఎందుకు తింటారు..!
టీ తాగలేనివారు ఉదయం పూట రెండు ఆకులను ఉదయం పరగడుపునే రెండు ఆకులను నమిలితే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ జామ ఆకులను ఎండబెట్టి పొడి చేసి కూడా తినవచ్చు.
డయాబెటీస్ పేషెంట్లకు జామఆకులు టానిక్ లా పనిచేస్తాయి.
Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!
జామ ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలలో..
జామ ఆకుల రసాన్ని కషాయం రూపంలో తీసుకున్నా, లేదా ఆకులను పచ్చిగా నమిలినా కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.
శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వును కరిగించడంలోనూ జామాకు రసం అద్భుతంగా పనిచేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 06 , 2024 | 04:42 PM