Vegetarian Protein : శాకాహారులు తినేందుకు 7 శాఖాహార ప్రోటీన్ పదార్థాలు ఇవే..!
ABN, Publish Date - Jun 28 , 2024 | 10:42 AM
కాయధాన్యాలు, చిక్ పీస్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ వంటి పప్పు ధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ అధికంగా అందిస్తాయి. ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.
తగినంత ప్రోటీన్ పొందడానికి మాసం, జున్ను తినవలసిన అవసరం లేదు. శాకాహారం మాత్రమే తీసుకునే చాలా మందికి మొక్క ఆధారిత పదార్థాలు చాలా ఉన్నాయి. బీన్స్, పాలు, పెరుగు, జొన్నలు, కొన్ని రకాల మొక్కలు ఆధారిత ప్రోటీన్ మూలాలు. ఈ ప్రోటీన్లు ఆరోగ్యకరమైనది, సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తీసుకోవడం తగ్గించడంలో సహకరిస్తాయి. వీటిలో ముఖ్యంగా మొక్కల నుంచి వచ్చే ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం.
కాయధాన్యాలు, చిక్ పీస్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ వంటి పప్పు ధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ అధికంగా అందిస్తాయి. ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.
టోపు..
టోఫు సోయా పాలతో తయారవుతుంది. పులియబెట్టిన సోయాబీన్స్ నుంచి దీనిని తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటుంది. అవసరమైన అన్ని అమైనోఆమ్లాలను కలిగి ఉంటుంది. కాల్షియం, ఇనుముతో సమృద్ధిగా ఉంటుంది.
Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..
క్వినోవా..
క్వినోవా అనేది మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న పదార్థం, ఇది ప్రోటీన్ మూలం. ఫైబర్, మెగ్నీషియం, ఇనుము అధికంగా ఉంటుంది. దీనిని సలాడ్స్, సూప్ లలో చేర్చుకోవచ్చు.
గింజలు, విత్తనాలు..
వీటిల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. ఈ గింజలు, విత్తనాల్ని స్నాక్స్స స్మూతీస్ రూపంలో తీసుకోవచ్చు.
ఎడమామె (చిక్కుళ్ళు)..
ఎడామామె అనేది సోయాబీన్స్ ఇవి ప్రోటీన్స్, ఫోలేట్, విటమిన్ కె, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉన్నాయి.
Biotin Rich Foods : ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ వీటిని తీసుకుంటే..
ఈస్ట్..
ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శాకాహారం తీసుకునే వారికి బి12 ఇందులో దొరుకుతుంది. పాస్తా, సలాడ్ వంటి వాటితో చీజ్ చక్కని ఎంపిక.
బఠానీలు..
ప్రోటీన్లు, ఫైబర్ కలిగిన బఠానీ సూప్, కర్రీలు, సలాడ్స్ వంటి పదార్థాలకు మంచి ఎంపిక.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 28 , 2024 | 10:42 AM