Healthy Foods : రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమయ్యే 10 ఆహారాలు ఇవే..
ABN, Publish Date - Jul 02 , 2024 | 03:47 PM
మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగడం వల్ల తలనొప్పి, దాహం పెరగడం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, నోరు పొడిబారడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
ఆరోగ్యకరమైన బ్లడ్ షుగర్ స్థాయిల కోసం కొన్ని ఇష్టమైనవి వదులుకోక తప్పదు. మధుమేహం ఉన్నవారు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోకుండా సమతుల్య ఆహారం తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మితంగా తీసుకోవాలి. ఒక వ్యక్తి కార్బోహైడ్రేట్లను తిన్నప్పుడు శరీరం ఇన్సలిన్ అనే హర్మోన్లు విడుదల చేయదు. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిరకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఆహారంలో కార్బోహైడ్రేట్లను లెక్కించడం ముఖ్యం. ఇది కార్బోహైడ్రేట్ల శాతం గురించి మాత్రమే కాదు. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వులు రక్తంలో చక్కెరను కూడా ప్రభావితం చేస్తాయి.
ఆహారంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెరుగుతుందో కొలవడాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ GIగా సూచిస్తారు. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగడం వల్ల తలనొప్పి, దాహం పెరగడం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, నోరు పొడిబారడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
భారతీయ వంటకాల్లో ప్రధానంగా చెప్పుకునే బియ్యం.. అన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
రక్తంలో చక్కెర పరుగుదల విషయంలో కార్బోహైడ్రేట్లు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు ప్రధానంగా కారణంగా మారవచ్చు.
Thyroid Patients : థైరాయిడ్ సమస్యలున్నప్పుడు ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు..!
వీటిలో ముఖ్యంగా పాస్తాలు, పకోడాలు, డ్రింక్స్ వంటివి ఉన్నాయి. డైట్ సోడాల్లో ఉండే జీరో క్యాలరీలలో కృత్రిమ స్వీటెనర్లున్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తాయి.
వోట్మిల్ బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఇందులో ఫైబర్ తీసివేయడం కారణంగా రక్తంలో చక్కెర పెరుగుదలకు దారి తీస్తుంది.
Health Tips : నిద్రలేవగానే ఈ సంకేతాలు హై బీపీ లక్షణాలు కావచ్చు.. ఇలాంటి లక్షణాలను చెక్ చేసుకోండి..!
కమలా రసంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ గా విభజించడాన్ని నెమ్మదించేలా చేస్తుంది. రసం తీయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
బ్రెడ్ ను తృణధాన్యాలతో తయారు చేయడం వల్ల ఇందులో గ్లైసెమ్క్ ఇండెక్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తాయి.
రెస్టారంట్ సూప్స్ లలో ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరిగేలా చేస్తుంది.
Children Health : వర్షాకాలంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో పిల్లల ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!
బంగాళాదుంప, మొక్కజొన్న, బఠానీ వంటి పిండి కూరగాయలలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
సాఫ్ట్ ఫీజీ డ్రింక్స్, క్యాన్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
ద్రాక్షపండ్లు కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 02 , 2024 | 03:48 PM