Cardamom : యాలకులు తినడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ABN, Publish Date - Jun 27 , 2024 | 10:21 AM
యాలకులలోని ముఖ్యమైన నూనె మెంథాన్ అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి జీర్ణక్రియను అందిస్తుంది. అలాగే కడుపులో మంటగా ఉండటాన్ని తగ్గిస్తుంది.
యాలకులు ( Cardamom )మన వంటకాల్లో భాగంగా మారిపోయాయి. వంటకాలకు ప్రత్యేకమైన సుగంధాన్ని ఇచ్చే యాలకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. సుగంధ ద్రవ్యాల రాణిగా యాలకులను పిలుస్తారు గొప్ప సువాసన, రుచికి ప్రసిద్ధి చెందిన యాలకులను తీపి వంటకాల్లోనే కాదు అన్ని రకాల వంటకాలకు వాడతారు. సువాసన గల మసాలా దినుసుగా కూడా యాలకులకు పేరుంది. దీనిలో ముఖ్యమైన నూనె ఉంటుంది. ఇది ఆల్పా టెర్పినోల్ 45 శాతం, మైర్సీన్ 27 శాతం, లిమోనెన్ 8 శాతం, మెంథోన్ 6శాతం ఉంటుంది. ఇవన్నీ సువాసనగల యాలకులకు మూలికా లక్షణాలను, ఔషధ గుణాలను అందిస్తాయి.
మన అమ్మమ్మలు, అమ్మలు ఎప్పుడూ పర్సులో లేదా ట్రావెల్ బ్యాగ్స్ లో కొన్ని యాలకులను వేసుకుని ప్రయాణం చేయడం చూసే ఉంటాం. ఎందుకు వీటిని తమతో ఉంచుకుంటారనే విషయం ఆలోచిస్తే..
1. ఇది (Cardamom) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2. యాలకులలోని ముఖ్యమైన నూనె మెంథాన్ అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి జీర్ణక్రియను అందిస్తుంది. అలాగే కడుపులో మంటగా ఉండటాన్ని తగ్గిస్తుంది.
3. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.
4. తాజా శ్వాసకు యాలకుల గింజలు నమలడం మంచిది. నోటి ఆరోగ్యాన్ని ఇది పెంచుతుంది.
Health Benefits : గుమ్మడికాయ గింజలు తింటే 6 విధాలుగా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
5. యాలకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
6. యాలకులు మంచి రక్త ప్రసరణకు, రక్తాన్ని పలుచగా చేయడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారించవచ్చు.
7.యాలకులు రెగ్యులర్ వినియోగం రక్తపోటు స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రక్తపోటు సంబంధిత గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Women Health : మోనోపాజ్ 40లలోనే వచ్చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.
యాలకులను వీటిలో వాడతాం..
1. బేకింగ్ పదార్థాలలో యాలకులను వాడతాం. కేకులు, కుక్కీస్ , బ్రెడ్ లలో వాడతాం.
2. యాలకుల టీ మంచి రుచిని, తాజాదనాన్ని కలిగి ఉంటుంది.
3.కాఫీ, హాట్ చాక్లెట్, స్మూతీస్ లలో చిటికెడు యాలకులు పొడి మంచి సుగంధాన్ని ఇస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 27 , 2024 | 10:21 AM