Heart Health : ప్రతిరోజూ ఎండుద్రాక్ష నీరు త్రాగడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలివే..!
ABN, Publish Date - Jun 20 , 2024 | 03:13 PM
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎండుద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెరిసే అందమైన చర్మాన్ని పొందవచ్చు.
ఎండుద్రాక్ష తియ్యగా, పుల్లగా ఉండే ఈ ఎండుద్రాక్షలను నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఎండుద్రాక్ష నీరు ప్రతి రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఎండుద్రాక్షను రాత్రిపూట నీటిలో నానబెట్టి సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు.
ఎండుద్రాక్ష నీటితో కలిగే ప్రయోజనాలు..
కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఎండుద్రాక్ష నీటిని క్రమం తప్పకుండా తాగితే కాలేయం శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం నుంచి హానికరమైన పదార్ధాలను ఫిల్టర్ చేస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలకు ఎండుద్రాభ సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ ను కలిగి ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, బి విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇందులోని ఇనుము ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. పొటాషియం గుండె కండరాల పనితీరుకు మద్దతు ఇస్తుంది.
Bottle Courd : ఈ వేసవిలో పొట్లకాయ తినడం వల్ల 5 ప్రయోజనాలు ఇవే..!
గుండె ఆరోగ్యానికి మద్దతు.. ఎండు ద్రాక్ష నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయాలు.. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఎండుద్రాక్ష నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మొత్తం కేలరీలను తీసుకోవడంలో సహాయపడుతుంది.
Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎండుద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెరిసే అందమైన చర్మాన్ని పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 20 , 2024 | 03:13 PM