Vitamin B6 : మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి6 ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే..!
ABN, Publish Date - Jul 09 , 2024 | 12:54 PM
విటమిన్ బి6 అధికంగా ఉండే ఆహారాల ద్వారా తగినంత మొత్తంలో తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ విటమిన్ లోపం ఉంటే కనుక చాలా రుగ్మతలకు కారణం అవుతుంది.
ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారంలో అనేక పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. ప్రత్యేకించి బి6 కోసం తీసుకునే ఆహారాలు మనకు జీవక్రియ, రోగనిరోధక పనితీరు, మెదడు ఆరోగ్యం, మానసిక స్థితి నియంత్రణ వరకు అనేక శారీరక ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం తీసుకోవాల్సిన ఆహారాల విషయాలనికి వస్తే..
ఈ ముఖ్యమైన విటమిన్ అనేక రుచికరమైన, పోషకమైన మూలాలను కలిగి ఉంది. శక్తిని పెంచుకోవాలన్నా, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ఈ ఫుడ్స్ తీసుకోక తప్పదు. విటమిన్ బి6 నీటిలో కరిగే బి కాంప్లెక్స్ విటమిన్. శరీరంలోని 100 ఎంజైమ్ ప్రతిచర్యకు ఇది అవసరం. విటమిన్ బి6కి మరోపేరు పిరిడాక్సిన్ అంటారు.
శరీర విధులకు బి6 కీలకమైన విటమిన్. మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. తెలివితేటలను పెంచుతుంది.
Tooth Brushes : మనం వాడే టూత్ బ్రష్‌ను ఎంత కాలానికి మార్చాలి..!
1. హిమోగ్లోబిన్ రూపొందించడంలో సహాయపడుతుంది. DNA, RNA ఏర్పడడానికి సహకరిస్తుంది.
2. కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ జీవక్రియలో, గ్లూకోనోజెనిసిస్, గ్లైకోజెనోలిసిస్ ప్రక్రియలలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
3. గర్భధారణ సమయంలో పిండం, మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.
4. విటమిన్ బి6 అధికంగా ఉండే ఆహారాల ద్వారా తగినంత మొత్తంలో తీసుకోవడం చాలా ముఖ్యం.
5. ఈ విటమిన్ లోపం ఉంటే కనుక చాలా రుగ్మతలకు కారణం అవుతుంది.
Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!
విటమిన్ బి6 లోపం ఉంటే...
చర్మం మీద దద్దుర్లు..
చేతులు, కాళ్లలో జలదరింపు
మూడ్స్ స్వింగ్స్
ఏ ఆహారాలలో విటమిన్ బి6 లభిస్తుంది..
పండ్లు, తాజా కూరగాయలు, ధాన్యలలో, మాంసాహారంలో కూడా విటమిన్ బి6 ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 09 , 2024 | 01:32 PM