Health benefits : తేనెటీగ పుప్పొడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ABN, Publish Date - Jun 26 , 2024 | 04:21 PM
తేనెటీగ పుప్పొడిని అనేక ఆరోగ్య ఆహార దుకాణాలలో దొరుకుతుంది. దీనిని ఎనర్జీ టానిక్ గా ఉపయోగిస్తారు. ఉబ్బసం, కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడానికి, అలెర్జీలను తగ్గించడానికి ఈ తేనెటీగ పుప్పొడిని వాడతారు.
తేనెటీగల పుప్పొడి గురించి విన్నారా? తేనెటీగలతో తేనె తెలుసుకానీ పుప్పొడి సంగతి మనలో చాలామందికి తెలియని విషయం. మూలికా వైద్యులైతే తేనెటీగ పుప్పొడి విషయంలో చాలా పోషకాలున్న ఆహారంగా చెబుతారు. ఈ తేనెటీగ పుప్పొడిలో విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు ఉంటాయి. తేనెటీగలు ఒక పువ్వు నుండి మరో పువ్వుకు ఎగురుతూ వాటి శరీరాలపై సేకరించే పుప్పొడి నుండి ఇది వస్తుంది. తేనెటీగ పుప్పొడిలో తేనెటీగ లాలాజలం కూడా ఉంటుంది.
తేనెటీగ పుప్పొడిని అనేక ఆరోగ్య ఆహార దుకాణాలలో దొరుకుతుంది. దీనిని ఎనర్జీ టానిక్ గా ఉపయోగిస్తారు. ఉబ్బసం, కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడానికి, అలెర్జీలను తగ్గించడానికి ఈ తేనెటీగ పుప్పొడిని వాడతారు.
తేనెటీగ పుప్పొడితో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తేనెటీగ పుప్పొడిలో ఆరోగ్యకరమైన విభిన్నమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
మోనోపాజ్ స్థితిలో శరీరంలో ఏర్పుడే వేడి ఆవిర్లను, రాత్రి చెమటలను, మూడ్ స్విగ్స్ వంటి అనేక అసౌకర్యాలను తగ్గిస్తుంది.
ఈ పుప్పొడి సురక్షితమేనా..
తేనెటీగ పుప్పొడి చాలా మందికి సురక్షితమే. కానీ దీనిని కొద్దిగానే ఉపయోగించాలి. మోతాదుకు మించి తీసుకోరాదు.
మరీ ఎక్కువగా తీసుకుంటే దురద, ఎరుపు, శ్వాసలోపం, దద్దుర్లు, వాపు, అనాఫిలాక్సిస్ వంటి సమస్యలు వస్తాయి.
Health Benefits : గుమ్మడికాయ గింజలు తింటే 6 విధాలుగా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
తేనెటీగ పుప్పొడి పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాదు. పాలిస్తున్న తల్లులు దీనిని ఉపయోగించకూడదు.
తేనెటీగ పుప్పొడి వార్ఫరిన్ వంటి కొన్ని రక్తాన్ని పల్చగా వాడితే రక్తస్రావం పెరగడానికి కారణం కావచ్చు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 26 , 2024 | 04:21 PM