ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

White Teeth : దంతాలను తెల్లగా మార్చేందుకు సహాయపడే మూలికలు ఇవే..!

ABN, Publish Date - May 29 , 2024 | 12:13 PM

పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా దంతాలను శుభ్రపరచడానికి, చిగుళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. పసుపులో లభించే పోషకాలు దంతాలు తెల్లబడటానికి సహకరిస్తాయి. పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.

teeth whiter

తెల్లటి దంతాల కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త ఉత్పత్తినీ పంటి తెల్లదనం పొందటం కోసం వాడుతూ ఉంటాం. ఇక నోటిదుర్వాసను నుంచి తప్పించుకునేందుకు కూడా మార్కెట్లో లభించే చాలా రకాల ఉత్పత్తులు, కొత్త కొత్త విధానాలు వాడుతూనే ఉంటాం. అయితే ఇంటి చిట్కాలతో, మూలికలతో మంచి ఫలితాలను పొందవచ్చు. పెద్దగా శ్రమలేకుండానే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

లవంగాలు.. ఇవి యాంటీ బాక్టీరియల్ కాబట్టి, చిగుళ్ల నొప్పి, పంటి నొప్పులకు లవంగాలు సాధారణంగా ఉపయోగిస్తారు. లవంగాల నూనె పళ్ళు తెల్లబడటానికి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

యాక్టివేటెడ్ చార్ కోల్.. కొబ్బరి చిప్పలు, సేంద్రియ పదార్థాల నుంచి సేకరించిన చార్ కోల్ ( బొగ్గు) పంటి మీద మరకలను పోగొట్టేందుకు సరిపోతుంది. దీనితో దంతాలు తెల్లగా మారతాయి.

వేప చిగుళ్లు.. వేపలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, పంటి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. నోటి శుభ్రతకు, దంత సంరక్షణకు పనిచేస్తుంది. ఒకప్పుడు వేపపుల్లతోనే దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉండేవారు. అయితే ఇది రాను రాను తగ్గింది. దంతాల శుభ్రతలో వేపకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి చిగుళ్ళు, పుల్లలు కూడా దంతాల సంరక్షణలో పనిచేస్తాయి.


Healthy Fruits: ఉదయాన్నే పరగడుపున ఈ పండ్లను తింటే చాలు.. ఇక మందులతో పనేలేదు..!

పసుపు... పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా దంతాలను శుభ్రపరచడానికి, చిగుళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. పసుపులో లభించే పోషకాలు దంతాలు తెల్లబడటానికి సహకరిస్తాయి. పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి దంతాల ఆరోగ్యానికి సహకరిస్తాయి.

తులసి.. తులసి ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, దంతాలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ చూర్ణం దంతాలకు పట్టించడం వల్ల సహజంగా తెల్లబడటానికి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Symptoms Of Typhoid: టైఫాయిడ్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..


స్ట్రాబెర్రీలు.. ఇవి దంతాలపై ఉండే మరకలను వదిలించుకోవడంలో చక్కగా పనిచేస్తాయి. ఆస్ట్రింజెంట్ మాలిక్ యాసిడ్ స్ట్రాబెర్రీలలో ఉంటుంది. ఇది దంతాలకు సహజమైన తెల్లదన్నాన్ని ఇస్తుంది.

సేజ్.. దంతాలను శుభ్రం చేయడంలో, నోటి బ్యాక్టీరియాను తగ్గించడంలో సహజంగా పనిచేస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 29 , 2024 | 12:13 PM

Advertising
Advertising