Women With Diabetes : మధుమేహం ఉన్న స్త్రీలలో అధికంగా కనిపించే సంకేతాలు ఇవే..
ABN, Publish Date - Jul 29 , 2024 | 12:08 PM
మధుమేహం స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కలిగే దీర్ఘకాలిక వ్యాధి. చిన్న చిన్న తేడాలున్నా దాదాపు ఇద్దరిలో ఒకే విధమైన లక్షణాలను కలుగజేస్తుంది.
మధుమేహం స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కలిగే దీర్ఘకాలిక వ్యాధి. చిన్న చిన్న తేడాలున్నా దాదాపు ఇద్దరిలో ఒకే విధమైన లక్షణాలను కలుగజేస్తుంది. జీవితకాలంలో ఒకసారి ఈ వ్యాధి వచ్చిన తర్వాత జీవితాంతం దీని గురించిన ఆహార జాగ్రత్తలు, వైద్య సహాయం తీసుకుంటూ ఉండాలి. మగవారితో పోల్చితే ఆడవారిలో టైప్ 1, టైప్ 2 మధుమేహం లక్షణాలు ఇలా ఉంటాయి. అవేమిటంటే..
మధుమేహం ఉన్న స్త్రీలలో కాండిడా అల్బికాన్స్ ఫంగస్ (Candida albicans fungus )కారణంగా నోటి ఇన్ఫెక్షన్లు, యోని ఇన్ఫెక్షన్లు ఉంటాయి. యోనిలో దురద, నొప్పి ఉంటాయి. నోటిలో తెల్లని మచ్చలు, ఎరుపు పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. కిడ్నీ వ్యాధి మధుమేహం ఉన్న పురుషుల కంటే స్త్రీలను మరింత ప్రభావితం చేస్తుంది. స్త్రీలలో డిప్రెషన్ రెండు రెట్లు అధికంగా ఉంటుంది. మధుమేహం ఉన్న మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ తక్కువ స్థాయిల కారణంగా వీరిలో మూత్రపిండాల వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంది.
Health Tips : ఎయిర్ పాడ్స్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..!
1. మధుమేహం ఉన్నవారిలో దాహం ఎక్కువగా ఉంటుంది. నోరు ఆరిపోతున్నట్టుగా దాహం ఉంటుంది.
2. కంటిచూపు మందగిస్తుంది.
3. షుగర్ ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాల్లో ఆకలి ఎక్కువగా ఉండటం కూడా ఒకటి. తినాలనే కోరిక పెరుగుతుంది.
Health Tips : పెద్దగా శ్రమలేకుండా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్‌లు తాగితే చాలు...!
4. చిన్న పని చేసినా అలిసిపోవడం, నీరసంగా ఉంటారు. స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
5. అప్పటి వరకూ ఉన్న బరువులో మార్పు కనిపిస్తుంది. ఒక్కసారిగా బరువు తగ్గుతారు.
6. షుగర్ ఉన్నవారిలో చేతులు, కాళ్ళు తిమ్మిరి ఎక్కువగా ఉంటాయి. నడవడానికి ఇబ్బంది పడతారు.
7. చర్మానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
స్త్రీల గర్భధారణ సమయంలో..
మధుమేహం ఉన్నట్లయితే.. స్త్రీలు తరచుగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) కలిగి ఉంటారు. ఇది గర్భం దాల్చడంలో సమస్యలకు దారి తీస్తుంది.
గర్భం ఉన్న స్త్రీలలో ఈ క్రింది లక్షణాలుంటాయి.
1. మూత్రానికి ఎక్కువగా వెళ్లడం
2. దాహం ఎక్కువగా ఉండటం
3. అలసట
4. వికారం
5. సాధారణం కంటే ఆకలి ఎక్కువగా అనిపించడం,
6. బరువు తగ్గడం
7. అంటువ్యాధుల సమస్యలు
Health Tips : క్యాన్సర్ ఉన్నవారు పర్పుల్ క్యాబేజీ తింటే ఇన్ని లాభాలా..!
గర్భధారణ సమయంలో అధిక రక్త చక్కెర స్థాయిలు, తల్లి, బిడ్డలకు ఇద్దరికీ ప్రమాదమే. దీని కారణంగా
1. ప్రీ- మెచ్యూర్ డెలివరీ
2. డెలివరీ కష్టం కావడం
3. అధిక రక్తపోటు
4. పుట్టుకతో శిశువులో వచ్చే లోపాలు
5. శిశువుకు కామెర్లు
6. శిశువులో శ్వాస సమస్యలు
7. తల్లిలో కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉంటాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 29 , 2024 | 12:11 PM