Smoking Habit: ధూమపానం చేస్తున్నారా..! మీ హెల్త్ ఎంత వరకూ పాడైందో ఇలా తెలుసుకోండి..!
ABN, Publish Date - Sep 09 , 2024 | 10:44 AM
ధూమపానం చేసే వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించడంలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ECG కోసం రెగ్యులర్ స్క్రీనింగ్ లు గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయపడతాయి. హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు ముందుగానే గుర్తించవచ్చు.
ధూమపాన వ్యసనం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ధూమపానం అనేది చాలా ఏళ్లుగా పాతుకుపోయిన అలవాటు. దీనితో కలిగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువే. ఈ అలవాటు నుంచి బయటపడాలంటే మాత్రం స్వీయ నియంత్రణ చాలా అవసరం. నికోటిన్ గమ్, లాజెంజెస్, నాసల్ స్ప్రేలు, నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరపీలు ఈ వ్యసనాన్ని అధిగమించేందుకు సహకరిస్తాయి. ధూమపానం తీవ్రమైనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తప్పవు.
భారతదేశంలో 12 కోట్లమంది పొగాకు వినియోగదారులు ఉన్నారు. 80 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం వల్ల వస్తుంది. దీనితో పాటుగా ధూమపానం నోటి, స్వరపేటిక, ఫారింక్స్ అన్నవాహిక, మూత్రపిండాలు, ధూమపానం, కాలేయం, గర్భాశయం, ప్యాంక్రియస్, కడుపు, మూత్రాశయం వంటి ఇతర క్యాన్సర్ల ప్రమాదం కూడా పెంచుతుంది.
1. ధూమపానం చేసేవారిలో కనిపించే సాధారణ వ్యాధులలో ఒకటి, బ్రోన్కైటిస్.
2. ఎంఫిసెమాకు ధూమపానం ప్రధాన కారణం, ఎంఫిసెమా అనేది ఊపిరితిత్తుల వ్యాధి.
3. ఈ వ్యాధుల బారిన పడకుండా వ్యసనాన్ని తగ్గించుకోవాలంటే మాత్రం ఈ పరీక్షలు తప్పనిసరి.
Smoking : ధూమపానాన్ని వదిలేసే ఆరోగ్య చికిత్సలు ఇవే..
గుండె ఎక్స్ రే..
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తెలిపేందుకు సహకరిస్తుంది. అంతే కాకుండా క్రానిక్ అబ్ర్స్టక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఎంఫిసెమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది.
స్పిరోమెట్రీ..
స్పిరోమెట్రీ ఊపిరితిత్తుల పనితీరును తెలియజేస్తుంది. ధూమపానం అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపించే ఉబ్బసం, COPD వంటి పరిస్థితులు ఊపిరితిత్తుల వ్యాధుల పురోగతిని ట్రాక్ చేసేందుకు సహకరిస్తుంది.
ఊపిరితిత్తుల CT స్కాన్..
CT స్కాన్, Xరేతో పోలిస్తే ఊపిరితిత్తుల పనితీరును, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఇతర సమస్యలు గుర్తించేందుకు సహకరిస్తుంది.
రక్త పరీక్షలు..
సాధారణంగా రక్త పరీక్షలు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో, ధూమపానానికి సంబంధించిన సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి.
Health Benefits : కాల్చిన అల్లం, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా..!
1. కంఫ్లీట్ బ్లడ్ కౌంట్.. మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు, రక్తహీనత, రక్తంలో ఇన్ఫెక్షన్లు వంటి పరిస్థితుల్ని గుర్తిస్తుంది.
2. లిపిడ్ ప్రొఫైల్.. ధూమపానం చేసే వారిలో పెరిగిన గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుపుతుంది.
3. కార్బాక్సీహెమోగ్లోబిన్ స్థాయిలు. రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని కొలుస్తుంది. ఇది ధూమపానం చేసేవారిలో ఎక్కువగా ఉంటుంది.
ధూమపానం చేసే వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ECG కోసం రెగ్యులర్ స్క్రీనింగ్ లు గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయపడతాయి. హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు ముందుగానే గుర్తించవచ్చు.
ధూమపానంతో..
ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
చర్మంలో వేగంగా వృద్ధాప్యం ఛాయలు కనిపిస్తాయి.
మధుమేహం, బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
కంటి శుక్లం, మచ్చలు, డ్రై ఐ సిండ్రోమ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
దంత క్షయం,. నోటి దుర్వాసన, దంత నష్టం, నోటి క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Read LatestNavya NewsandTelugu News
గమనిక:పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Sep 09 , 2024 | 10:44 AM