ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Candida : ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాల నుండి నివారణ వరకు... !

ABN, First Publish Date - 2024-02-09T14:14:20+05:30

క్లినికల్ నమూనా శిలీంద్రాల ద్వారా రోగ నిర్థారణ జరుగుతుంది.

Candida

ప్రపంచాన్ని కుదిపేసే చాలా సమస్యల్లో అనారోగ్యం ఒకటి. కరోనా తర్వాత ఎక్కడో ఒకచోట వింత వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వైరస్ దాడులు ఇలా ఎదో ఒకటి. ఇప్పుడు USలో వ్యాప్తి చెందుతున్న ఫంగల్ ఇన్ఫెక్షన్ విషయానికి వస్తే.. దీనిని కాండిడా ఆరిస్ అంటారు. దీనికి సరైన నివారణలు, ఇన్ఫెక్షన్ నియంత్రణ గురించి తెలుసుకుందాం.

కాండిడా ఆరిస్ అనేది ఒక రకమైన ఈస్ట్. ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. దీనిని మొదటిసారిగా 2009లో జపాన్‌లో కనుగొన్నారు. ఇది ప్రధానంగా ICU సెట్టింగ్ లో నోసోకోమియల్ వ్యాప్తికి సంబంధించినది. ఇది 35 నుండి 50% మరణాల రేటుతో ముడి పడి ఉంది. ఈ ఇన్ఫెక్షన్స్ కు ప్రమాద కారకాలు నియంత్రణలో లేని CKD, IVలు, కాథెటర్ లు, యూరినరీ కాథెటర్,ఫీడింగ్ ట్యూబ్ లు వంటి ఇన్ వాహివ్ వైద్య పరికరాలు. కాండిడా ఆరిస్ రక్తప్రవాహం, మూత్ర నాళం, గాయాలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకినపుడు లక్షణాలలో ముఖ్యంగా జ్వరం ఉంటుంది.

కాండిడా ఆరిస్‌ను ఎలా నిర్దారించాలి.

క్లినికల్ నమూనా ఈ శిలీంద్రాల ద్వారా రోగ నిర్థారణ జరుగుతుంది.


సంక్రమణ నివారణ, నియంత్రణ..

కాండిడా ఆరిస్ ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఇది మల్టీడ్రగ్-రెసిస్టెంట్ ఈస్ట్, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే పరిస్థితితో అలాగే మరణాలకు కారణం అవుతుంది. కొన్ని రకాల మందులతో ఈ పరిస్థితిని తగ్గించుకోవచ్చు. ఇది ఇతరులకు వ్యాపించే వ్యాధి. ఈ సంక్రమణ వ్యాప్తిని నియంత్రించడం చాలా అవసరం.

ఈ వ్యాధి సోకిన వారు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. క్లోరెక్సిడైన్ నీటితో స్నానం చేయించాలి. అలాగే రోజువారీ టెర్మినల్ క్రిమిసంహారక చర్యలను తీసుకోవాలి. పెషెంట్ పక్కన ఉండే అటెండెంట్లు తప్పనిసరిగా డిస్పోజబుల్ గ్లోవ్స్‌ని వాడాలి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - 2024-02-09T14:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising