Super Foods : శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు కాస్త ఎక్కువైనా ఇబ్బందే.. !
ABN, Publish Date - Jul 18 , 2024 | 12:16 PM
విటమిన్ బి12 స్థాయిలు శరీరంలో ఎంత వరకూ ఉన్నాయనే విషయాన్ని ఆన్లైన్ ద్వారా దొరికే చిన్న కిట్ ద్వారా పరీక్షించుకోవచ్చు. అచ్చం మనం షుగర్ టెస్ట్ చేసుకున్నట్టుగానే ఇదీ ఉంటుంది.
విటమిన్ బి12 లేదా కోబాలమిన్ ఇది మన శరీరంలో DNA తయారు చేయడం, కణాలలో శక్తిని పెంచడం వంటి అనేక ప్రక్రియలను శరీరంలో చేస్తుంది. విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత, అలసట, నిరాశతో సహా అనేక రకాల లక్షణాలకు దారితీస్తుంది. బి12 దీర్ఘకాలికంగా లోపిస్తే మాత్రం మెదడు, నాడీ వ్యవస్థలోని ఇతర భాగాలకు శాశ్వత నష్టం కలుగుతుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో బి12 ఉంటుందా.. అసలు దీనికోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ బి12 బ్యాక్టీరియా ద్వారా సృష్టించబడుతుంది. జంతు ఉత్పత్తుల్లో మాత్రమే సహజంగా లభిస్తుంది. బి12 నీటిలో కరిగే విటమిన్. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే విటమిన్ బి12 శరీరంలో ఎక్కువైతే ఏం అవుతుంది.
ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం అయినా, విటమిన్స్, మినరల్స్ అయినా మితంగా తీసుకోవాలి. ఏదీ ఎక్కువైనా సరే శరీరం వ్యతిరేకంగానే పనిచేస్తుంది. విటమిన్ బి12 విషయానికి వస్తే ఈ విటమిన్ శరీరంలో సరిగా లేకపోయినా ఇబ్బందే, మోతాదుకు మించి ఉన్నా కూడా ఇబ్బంది తప్పదు. అందుకే విటమిన్ బి12 స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
విటమిన్ బి12 అధికంగా ఉంటే..
విటమిన్ బి12 ఆహారాలలో క్లామ్స్, చేపలు, పీతలు, మాంసం, బలవర్థకమైన తృణధాన్యాలు, సోయామిల్క్, టోఫు, పాల ఉత్పత్తులు, చీజ్, గుడ్లు ఉన్నాయి.
రోజులో 2.4mcg తీసుకోవాలి. దీని లోపం కారణంగా శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి.
Heart Problem : గుండె పోటు రాబోతుందని శరీరం ముందే చెబుతుందా..!
1. చర్మం మీద దద్దుర్లు కనిపిస్తాయి. దురద, వాపుతో కూడిన చర్మం ఇరిటేషన్ ఉంటుంది. చర్మం ఎర్రగా మారి కనిపిస్తుంది. తేలిక నుంచి ఎక్కువగా ఉంటాయి.
2. విటమిన్ బి12 అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందే.. దీనిని అధికంగా తీసుకుంటే కనుక జీర్ణ సమస్యలు ఉంటాయి. వికారం, కడుపు నొప్పి ఉంటాయి.
3. తల తిరగడం అనిపిస్తుంది. శరీరంలో విటమిన్ బి12 స్థాయిని అధికంగా కలిగి ఉండటం వల్ల కలిగే సాధారణ లక్షణం. ఈ లక్షణం రాత్రి సమయంలో కనిపిస్తుంది.
Cardamom Tea : నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!
4. తలనొప్పి కూడా అనిపిస్తుంది. విటమిన్ బి12 ఎక్కువగా ఉండటం అధిక స్థాయిలు మెదడుకు రక్త ప్రసరణపెరుగుదలకు కారణం కావచ్చు.
5. చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి ఎక్కువగా ఇలా రాత్రి సమయాల్లో ఉంటుంది. దీనికి అధిక విటమిన్ బి 12 కారణం కావచ్చు. నరాల పనితీరుపై అధిక విటమిన్ బి ప్రభావాల కారణంగా ఇలా జరుగుతుంది.
6. ఆందోళన అనేది అధిక బి12 కారణంగా కూడా కావచ్చు. మానసిక స్థితిని నియంత్రించడం ద్వారా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
ఇంట్లో విటమిన్ బి12 స్థాయిలను ఎలా పర్యవేక్షించుకోవాలి.
విటమిన్ బి12 స్థాయిలు శరీరంలో ఎంత వరకూ ఉన్నాయనే విషయాన్ని ఆన్లైన్ లో దొరికే చిన్న కిట్ ద్వారా పరీక్షించుకోవచ్చు. అచ్చం మనం షుగర్ టెస్ట్ చేసుకున్నట్టుగానే ఇదీ ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 18 , 2024 | 12:16 PM