Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!
ABN, Publish Date - Jul 05 , 2024 | 12:06 PM
పసుపులో ఉండే గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. పసుపు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల మెరిసే చర్మం సొంతం అవుతుంది.
చర్మ సౌందర్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. దీనికోసం మనం ఉపయోగించని ఉత్పత్తులంటూ ఉండవు. అటు ఇంటి చిట్కాలు, ఇటు మార్కెట్లోకి వచ్చే పేరున్న ఉత్పత్తులు అన్నీ ముఖం మీద ప్రయోగించేస్తూ ఉంటాం. అయితే ముఖ సౌందర్యం పెరగడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ప్రతిరోజూ వంటకాల్లో వాడే పసుపుతో అందాన్ని పెంచుకోవచ్చు. పసపులో ఉండే పోషకాలు చర్మానికి పోషణను అందించడంలో మొటిమల సమస్యను దూరం చేయడంలో ముందుంటుంది. దీనితో..
పసుపులో ఉండే గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. పసుపు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల మెరిసే చర్మం సొంతం అవుతుంది. కాస్మెటిక్ ఉత్పత్తులకు బదులు ఇంటి చిట్కాలతో కంటి చుట్టూ నల్లటి వలయాలు, మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!
చర్మాన్ని మెరిసేలా చెయ్యడంలో బియ్యం నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. మామూలుగా బియ్యాన్ని కడిగిన నీటిని పారబోస్తూ ఉంటాం. అలా కాకాకుండా ఈ నీటితో ముఖాన్ని, మెరిసేలా చేయవచ్చు. చర్మానికి ఇది నిగారింపును అందించడంతో పాటు మొటిమలు, మచ్చలు వంటి సమస్యతో పోరాడుతుంది.
Rainy Season : వానాకాలం ఈ శుభ్రత పాటిస్తున్నారా.. లేదంటే వ్యాధులు తప్పవ్..!
బియ్యం నీరు, పసుపు.. దీనిని తీసుకుని ముఖాన్ని కడగాలి ఇలా చేయడం వల్ల కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. చర్మం నిగారింపుతో పాటు మచ్చలు కూడా తొలగిపోతాయి. కాంతివంతంగా మారడానికి ఇందులోని ఆక్సిడెంట్లు, విటమిన్లు, పుష్కలంగా ఉండటమే కారణం. అలాగే పసుపులో ఉండే కర్కుమిన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 05 , 2024 | 12:06 PM