Health Benefits : కర్బూజాని అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?
ABN, Publish Date - Jun 15 , 2024 | 03:05 PM
పుచ్చకాయ, బత్తాయి, సపోటా, యాపిల్, కర్బూజా ఇలా ప్రతి పండు జ్యూస్ రూపంలో తీసుకుంటే బావుంటుంది. కానీ ఈ పండును ఎవరు తీసుకోకూడదు. కర్బూజాతో కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.
వేసవి వచ్చిందంటే ఆ కాలానికి అందుబాటులో ఉన్న పండ్లను ఎంచుకుని మరీ జ్యూస్ లుగా తీసుకుంటూ ఉంటారు. పుచ్చకాయ, బత్తాయి, సపోటా, యాపిల్, తర్బూజా ఇలా ప్రతి పండు జ్యూస్ రూపంలో తీసుకుంటే బావుంటుంది.
ముఖ్యంగా 100 గ్రాముల కర్బూజా పండులో..
ఇందులో ప్రోటీన్ 0.84 గ్రాములు
కార్బోహైడ్రేట్లు 8.6 గ్రాములు
డైటరీ ఫైబర్స్ 0.9 గ్రాములు
కొవ్వు 0.19 గ్రాములు
కేలరీలు 34 కేలరీలున్నాయి. కర్బూజా మెరుగైన కంటి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తి, బ్లడ్ ప్రెజర్ స్థాయిలను తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.
Golconda Bonalu Festival : జూలై 7న వైభవంగా జరగనున్న గోల్కొండ బోనాలు జాతర..
ఈ పండును తీసుకోవడం వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నాం, అలాగే ఇందులో ఉండే విటమిన్లు, పోషకాల గురించి కూడా తెలుసుకున్నాం. అయితే దీనిని ఎవరు తీసుకోకూడదో తెలుసుకుందాం. తర్బూజా పండును తినడం వల్ల కొన్ని ఇబ్బందులు అదీ కొందరిలో మాత్రమే ఉంటాయట అవేమిటంటే..
1. చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది.
2. జీర్ణశయాంతర సమస్యలు రావచ్చు. అంటే శరీరంలో గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
3. జీర్ణక్రియ కష్టంగా మారవచ్చు. ఎసిడిటీ, జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారడం జరుగుతుంది.
4. విరేచనాలు.. ఫైబర్, అధిక వాటర్ కంటెంట్ కారణంగా విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది.
Super Foods Found : విదేశీ పోషకాహారాలు ఎందుకు? మన దేశంలో దొరికే సూపర్ ఫుడ్స్ చాలు.. ఆరోగ్యాన్ని పెంచేందుకు..
ఎవరు తినకూడదు..
1. కడుపు సమస్యలు ఉన్నవారు ఈ పండును అస్సలు తినకూడదు.
2. గ్యాస్, డయేరియా వంటి సమస్యలు ఉంటే ఈ పండును తినకపోవడం మంచిది.
3. దగ్గు, జలుబు ఉన్నప్పుడు కర్బూజాని తినకూడదు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 15 , 2024 | 03:08 PM