ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Thyroid Patients : థైరాయిడ్ సమస్యలున్నప్పుడు ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు..!

ABN, Publish Date - Jul 02 , 2024 | 01:03 PM

హార్మోన్లు శరీరంలో చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, థైరాయిడిటిస్, హషిమోటో థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చేయలేక పోయే పరిస్థితి ఇందులో ముఖ్యంగా శరీరంలో ఊబకాయం మరింత వేగంగా పెరుగుతుంది.

Thyroid Patients :

థైరాయిడ్ రోగులు ఆహారం తీసుకోవాలంటే చాలా కంగారు పడతారు. ఏది తినాలి. ఏం తినకూడదు అనే దానిమీద సరైన అవగాహన ఉండదు. థైరాయిడ్ ఉన్నవారిలో ఆహారం గురించి ఆందోళన ఉంటుంది. కొంత వ్యాయామం చేయడం, ఆహారం విషయంలో హైపో థైరాయిడిజం పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత ఏవంటే..

థైరాయిడ్ అటువంటి వ్యాధిగా మారడానికి సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం కూడా కారణం కావచ్చు. హార్మోన్లు శరీరంలో చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, థైరాయిడిటిస్, హషిమోటో థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చేయలేక పోయే పరిస్థితి ఇందులో ముఖ్యంగా శరీరంలో ఊబకాయం మరింత వేగంగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆహారంలో, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం థైరాయిడ్ ను నియంత్రించేలా చేస్తుంది. బరువు తగ్గించే విధంగా ఏం తినాలి, ఏం తినకూడదు అనేది తెలుసుకోవాలి.

థైరాయిడ్ ఔషధం తీసుకున్న తర్వాత..

థైరాయిడ్ మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకున్న తర్వాత ఏదైనా తిన్న అరగంట ఈ మందు తీసుకోవాలి. అలాగే థైరాయిడ్ ట్యాబ్లెట్లతో పాటు కాల్షియం, ఐరన్ మందులు వేసుకోకూడదు.

Health Tips : నిద్రలేవగానే ఈ సంకేతాలు హై బీపీ లక్షణాలు కావచ్చు.. ఇలాంటి లక్షణాలను చెక్ చేసుకోండి..!

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎటువంటి వ్యాయామాలు చేయాలి.

థైరాయిడ్ ఉన్న రోగి రోజులో 40 నుంచి 45 నిమిషాల పాటు ఫిట్ నెస్ వ్యాయామాలు చేయాలి. జీవక్రియను వేగవంతం చేసుకోవాలి. వీరు వేగంగా బరువు పెరిగే సమస్య ఉంటుంది కనుక బరువు తగ్గే విధంగా వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.

థైరాయిడ్ ఉన్నవారు ఏమి తినాలి..

థైరాయిడ్ ఉన్నవారు ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు, తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. శరీరంలో థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే పండ్లు, కూరగాయలలో సూక్ష్మ, స్థూల పదార్థాలు రెండూ కనిపిస్తాయి. అయోడిన్ ఉప్పు ఉపయోగించాలి. సీఫుడ్ కూడా తీసుకోవాలి. శరీరంలో అయోడిన్ లోపించడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది.


Children Health : వర్షాకాలంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో పిల్లల ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!

థైరాయిడ్ రోగులకు ఎటువంటి విటమిన్లు అవసరం..

థైరాయిడ్ రోగికి శరీరంలో విటమిన్ డి లోపం కూడా కనిపిస్తుంది. ఇందుకోసం రోజులో కాసేపు ఎండలో కూర్చోవాలి. డాక్టర్ సలహా మీద సప్లిమెంట్స్ తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆకు కూరలు, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నట్స్, డ్రై ఫ్రూట్స్, సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉండాలి.

థైరాయిడ్ రోగి ఏవిధమైన ఆహారం తీసుకోవాలి.

థైరాయిడ్ ఉన్నప్పుడు జీవక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కొవ్వు పదార్థాలు, వేయించిన ఆహారాలు, మితిమీరిన తీపి పదార్థాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను పూర్తిగా మానేయాలి. క్యాబేజీ, బ్రోకలీ, సోయా వంటి క్రూసిఫెరస్ కూరగాయలలో గోయిట్రోజెన్ ఉంటుంది. ఇవి థైరాయిడ్ రోగికి హాని కలిగిస్తాయి. థైరాయిడ్ రోగులు తక్కువగా తినాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 02 , 2024 | 01:03 PM

Advertising
Advertising