Super Food : ఎర్ర రైస్ చేసే మేలు ఏమిటి.. దీనిని తీసుకుంటే..
ABN, Publish Date - Jul 03 , 2024 | 01:02 PM
ఎర్రటి ఈ బియ్యంలో పోషకాలు అనేకం దాగి ఉన్నాయి. పాలిష్ చేసిన తెల్ల బియ్యంకన్నా, బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇంకా ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు బి1, బి2 ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ముఖ్యంగా తృణధాన్యాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పెద్దలు, పిల్లలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. ఆచరిస్తున్నారు. మన సాంప్రదాయ పంటలలో ధాన్యం విషయాలనికి వస్తే చాలా రకాల ధాన్యాలు మనం సాగు చేస్తున్నాం. వాటిలో బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన శరీరానికి అందుతాయి. రెడ్ రైస్ విషయానికి వస్తే ఇందులో అనేక పోషకాలున్నాయి.
ఎర్ర బియ్యంలో ఆంథోసైనిన్ అనే విలక్షణమైన పదార్థం ఉంది. ఇది ఎర్ర ఉల్లి, ఎర్ర బీట్ రూట్ లలో కనిపిస్తూ ఉంటుంది. ఈ బయోఫ్లేవనాయిడ్స్ కు దగ్గరి సంబంధం ఉన్నందువల్ల ఈ ఎర్ర బియ్యం తీసుకుంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఈ ఎర్ర ధాన్యం ప్రపంచం మొత్తం సాగులో ఉంది. ఈ ఎరుపు ధాన్యంలో అధిక ఫైబర్, ఐరన్ కంటెంట్ కలిగి ఉన్నాయి. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
పుష్కలమైన పోషకాలున్నాయి.
ఎర్రటి ఈ బియ్యంలో పోషకాలు అనేకం దాగి ఉన్నాయి. పాలిష్ చేసిన తెల్ల బియ్యంకన్నా, బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇంకా ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు బి1, బి2 ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల కండరాలు, నరాల పనితీరుతో సహా అనేక శారీరక విధులకు మెగ్నీషియం కీలకంగా పనిచేస్తుంది. అయితే బలమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. మెదడు ఆరోగ్యానికిఇవి సహకరిస్తాయి.
Children Health : వర్షాకాలంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో పిల్లల ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!
అధిక ఫైబర్ కంటెంట్..
రైస్ లక్షణాలలో ఒకటి ఇందులో అధిక శాతం ఫైబర్ కలిగి ఉండటం. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు డైటరీ ఫైబర్ అవసరం. ఇది సాధారణ ప్రేగు కదలికలకు సహకరిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అధిక ఫైబర్ ఆహారాలు గుండె జబ్బులు, మధుమేహం, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించగలదు.
Health Benefits : అంజీర్ ఎప్పుడు తినాలి. దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..!
గుండె ఆరోగ్యానికి..
రెడ్ రైస్ గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అధిక ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో, కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారించడంలో కూడా సహకరిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు..
గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతుందో కొలుస్తుంది. ఈ రెడ్ రైస్ కారణంగా రక్తంలో చక్కెర వేగంగా పెరగడాన్ని తగ్గించవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు..
ఎర్ర బియ్యంలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే సమ్మేళనాలు ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. కణాలను దెబ్బతీస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడం ద్వారా యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్, మ్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ వంటి దీర్థకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 03 , 2024 | 01:02 PM