ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : జికా వైరస్ అంటే ఏమిటి? దోమకాటును నివారించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి..!

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:50 PM

ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగే అవకాశాన్ని నివారించాలి. దీనికోసం ఇంటి చుట్టుపక్కల మురికి నీరు నిల్వ లేకుండా చేయాలి. చిన్న చిన్న పాత్రల్లో, పూల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి.

Health

వానాకాలం వచ్చిందంటే దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఈ కాలంలో ఏడెస్ దోమలు కుట్టినట్లయితే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. దోమ కాటు ద్వారా సంక్రమించే జీకా వైరస్ కూడా అంతే ప్రమాదంగా మారుతుంది. 1952లో మానవులలో గుర్తించిన జికా వైరస్ అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ వస్తుంది. ఈ వైరస్ కారణంగా జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. ఏడెస్ దోమ, ఏడెస్ ఈజిప్టి, ఏడెస్ ఆల్బోపిక్టస్ ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు పగటిపూట, తెల్లవారుజామున, మధ్యాహ్నం సమయాల్లో కుడతాయి.

గర్భధారణ సమయంలో తల్లి నుంచి పిండానికి లైంగిక సంపర్కం ద్వారా, రక్త మార్పిడి, అవయవ మార్పిడి ద్వారా కూడా ఈ వైరస్ సంక్రమిస్తుంది. గర్భధారణ సమయంలో జికా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే పుట్టబోయే బిడ్డలో లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. మైక్రోసెఫాలీ, అంటే శిశువు తల ఊహించిన దానికింటే చిన్నదిగా ఉంటుంది. దీనితో బిడ్డలో మెదడు లోపాలు కలుగుతాయి.

Health Tips : ముఖం, కళ్లపై కనిపించే గుండెపోటుకు సంబంధించిన సంకేతాలు తెలుసా..

జీకావైరస్ సోకిన చాలా మందిలో లక్షణాలు పెద్దగా కనిపించవు. చాలా తేలికపాటివిగా ఉంటాయి.

1. జ్వరం

2. దద్దుర్లు

3. తలనొప్పి

4. కీళ్ల నొప్పి

5. కండ్లకలక

6. కండరాల నొప్పి ఉంటుంది.

జికా వైరస్‌కు చికిత్స..

జికా వారస్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడంలో, దోమకాటును నివారించడం చాలా అవసరం. ముందుగా ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగే అవకాశాన్ని నివారించాలి. దీనికోసం ఇంటి చుట్టుపక్కల మురికి నీరు నిల్వ లేకుండా చేయాలి. చిన్న చిన్న పాత్రల్లో, పూల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. చెత్తను ఇంటికి దూరంగా పారవేయడం, మంట పెట్టడం చేయాలి. దోమలు వచ్చే సమయం సాయంత్రం ఆరు తర్వాత కిటికీలు, తలుపులను మూసివేయాలి. దోమలను తరిమికొట్టే విధంగా సహజమైన పద్దతులను వాడటం ముఖ్యం.


Health Tips : జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తింటే చాలట.. !

సహజమైన పద్దతుల్లో..

DEET, పికారిడిక్, IR3535 లేదా నిమ్మకాయ, యూకలిప్టస్ నూనెను పడుకునే పరిసరాల్లో, చర్మం మీద పూసుకోవాలి. దోమ తెరలను వాడుతుండాలి.

దోమకాటు నుంచి రక్షణ.. దోమకాటు నుంచి రక్షణ పొందేందుకు ఒంటినిండా దుస్తులు ధరించాలి. చేతులు పొడవుగా ఉంటే షర్ట్స్, ప్యాంట్లు వేసుకోవాలి.

Hair care : వెంట్రుకలు పెళుసుగా ఉంటే పెరుగు మాస్క్ వేయండి.. సరిపోతుంది..!


దోమల సంచారం ఎక్కువగా ఉండే సమయాల్లో ఇంట్లోనే ఉండటం మంచిది.

దోమతెరలను ఉపయోగించడం వల్ల చిన్న పిల్లలు దోమల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా అనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 05 , 2024 | 12:50 PM

Advertising
Advertising
<