Health Tips : ఈ ఆహారాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి రిలీఫ్..!
ABN, Publish Date - May 11 , 2024 | 02:11 PM
చాలా రకాల వ్యాధులను మంచి పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా నయం చేసుకోవచ్చు. తీవ్రతను తగ్గించుకోవచ్చు. శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనితో అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడే వారు ఆహారంలో శ్రద్ధ తీసుకోవాలి.
శరీరం పనితీరులో ఏ క్రియ జరగడానిక ఆటంకం కలిగినా అది మొత్తం శరీరం ఆరోగ్యం మీద పడుతుంది. శరీరానికి కావాల్సిన విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే కాస్త మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరానికి శక్తితో పాటు మంచి పోషణను కూడా అందిస్తుంది.
చాలా రకాల వ్యాధులను మంచి పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా నయం చేసుకోవచ్చు. తీవ్రతను తగ్గించుకోవచ్చు. శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనితో అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడే వారు ఆహారంలో శ్రద్ధ తీసుకోవాలి. ఈ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి కీళ్ళు, ఎముకలలో నొప్పి, వాపు పెరుగుతుంది. ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్చిన్నమైతే యూరిక్ యాసిడ్ సమస్య ఏర్పడుతుంది. దీనికి తక్కువ శారీరక శ్రమ, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త ఉంటుంది. వీరు ఎలాంటి పండ్లను ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటే.. !
ఈ రోగి ఏ పండ్లను తినవచ్చు..
బ్లాక్బెర్రీస్.. బ్లాక్బెర్రీస్ వేసవి సీజన్లో ఎక్కువగా వస్తాయి. ఇందులోని పోషకాల విషయానికి వస్తే.. బ్రెర్రీలు జీవక్రియను పెంచుతాయి. శరీరంలో వాపును తగ్గిస్తుంది.
Hair Growth: జుట్టు పెరుగుదలకు ఉల్లి, వెల్లుల్లి రెండింటిలో ఏది బెస్ట్?
చెర్రీస్.. యూరిక్ యాసిడ్ రోగి చెర్రీస్ తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ బి6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి ఉంటాయి. ఇవి అధికంగా యూరిక్ యాసిడ్‌ను తగ్గించే ఖనిజాలను కలిగి ఉంటాయి.
అరటి పండు.. యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని నివారిస్తుంది. అరటి పండ్లను తినాలి. ఇందులోని ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. పేగు సమస్యలను తగ్గిస్తుంది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.
Cold and Cough : వేసవిలో ఏది తీసుకున్నా జలుబు తప్పడంలేదా.. ఇలా చేసి చూడండి..
కివీ.. పుల్లటి జ్యూస్ తాగడం వల్ల శరీరానికి పోటాషియం, ఫోలేట్ లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కివిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.
యాపిల్ ఎండాకాలం, చలికాలం కూడా లభిస్తుంది. దీనిని అధికంగా తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్ రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - May 11 , 2024 | 02:11 PM