Health Benefits : అంజీర్ ఎప్పుడు తినాలి. దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..!
ABN, Publish Date - Jul 01 , 2024 | 01:49 PM
అంజీర్ తీపి రుచితో అనేక ఆరోగ్య పోషకాలను కలిగి ఉంది. దీనిని ఉదయం, సాయంత్రం ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. లేదా రెండు పూటలూ తక్కువ మోతాదుతో తీసుకోవచ్చు.
పచ్చిగా, పండురూపంలో కంటే డ్రైఫ్రూట్స్ గా తీసుకునే వాటిలో మంచి ఆరోగ్యప్రయోజనాలుంటాయి. రోజూ కాసిని బాదం గింజలు, శనగలు, పెసలు, ఆక్రోడ్స్, అంజీర్ ఇలా ఏవి తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకునే అంజీర్ తినడానికి చాలా ప్రత్యేకమైనది. దీనిలోని పోషక విలువలు ఆరోగ్యంగా ఉండేందుకు రోజువారి ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది. అంజీర్ తీపి రుచితో అనేక ఆరోగ్య పోషకాలను కలిగి ఉంది. దీనిని ఉదయం, సాయంత్రం ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. లేదా రెండు పూటలూ తక్కువ మోతాదుతో తీసుకోవచ్చు. అయితే ఉదయం సమయంలో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో తెలుసుకుందాం.
ఉదయం ప్రయోజనాలు..
శక్తి స్థాయిలను పెంచండి. ఉదయం పూట అంజీర్ తినడం వల్ల దాని సహజ చక్కెరల కారణంగా త్వరగా శక్తిని పొందవచ్చు.
జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉదయం పూట అంజీర్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఆకలిని నియంత్రిస్తుంది. రోజంతా అతిగా తినడం అలవాటు ఉన్నవారు అంజీర్ తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గించుకోవచ్చు.
Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
సాయంత్రాలు తీసుకుంటే..
రిలాక్సేషన్ కోసం.. అంజీర్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది సాయంత్రం తీసుకోవడం వల్ల కండరాలు విశ్రాంతిని పొందుతాయి.మంచి నిద్ర వస్తుంది.
బరువు ఎక్కువగా ఉండే వారు సాయంత్రం పూట అంజీర్ తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు..
అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
విటమిన్లు, ఖనిజాలతో మొత్తం ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, ఇ, కె, పొటాషియం, మెగ్నీషియం కలిగి ఉంటాయి.
Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. అత్తిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యానికి కూడా అంజీర్ పండ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఎముకుల ఆరోగ్యానికి ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ ఎముక సాంద్రతను పెంచుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 01 , 2024 | 01:49 PM