Milk Time : పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !
ABN, Publish Date - Jul 19 , 2024 | 03:40 PM
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి పాలకు మంచి గుణాలున్నాయి.
పాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.. పాలలోని ప్రోటీన్స్ చిన్నా పెద్దా అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే పాలను తాగేందుకు ప్రత్యేకమైన సమయం అంటూ ఉందా.. పాలు తాగాలంటే ఏ సమయంలో తాగాలి. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎముకల దృఢంగా మారుతాయి. కొందురు ఉదయం పాలు తాగితే, మరికొందరు సాయంత్రం, రాత్రి సమయాల్లో పాలు తాగుతారు. అసలు పాలు ఎప్పుడు తాగుతారు.
సరైన సమయం ఏదీ..
పాలు తీసుకోవడానికి సరైన సమయం నిద్ర వేళకు ముందు తాగడమే. ఇక పిల్లలైతే ఉదయాన్నే పాలను తీసుకోవడం మంచిది. రాత్రిపూట పాలు తాగడం వల్ల శరీరం ఎక్కువ కాల్షియంను గ్రహిస్తుంది.
Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
పాలలోని పోషకాలతో శక్తి, ఎముకల బలాన్ని పెంచుతాయి. పాలలో ముఖ్యంగా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి, ఫాస్పరస్ ఉన్నాయి. రోజూ పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గుండెల్లో మంట సమస్య తగ్గుతుంది.
రోజులో 2 నుంచి 3 కప్పుల పాలను సులభంగా తీసుకోవాలి. పాలు ఫుల్ క్రీన్ అయితే బరువును పెంచే అవకాశం ఉంటుంది. అందుకని రోజుకు 1 నుంచి 2 కప్పుల పాలను మాత్రమే తాగాలి. తక్కువ కొవ్వు పాలు తీసుకోవచ్చు. కానీ ఏ పాలైనా మితంగా తీసుకోవాలి. ఎక్కువ పాలు తీసుకోవడం ఎప్పుడూ జీర్ణం కావడంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
మామిడి పండ్లు, అరచిపండ్లు, సీతాఫలాలు, పండ్లు, పెరుగుతో కలపకూడదు. అలా పండ్లను పాలతో కలిపినప్పుడు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వస్తాయి. టాక్సిన్స్, సైనస్, జలుబు, దగ్గు, అలెర్జీలకు కారణం కావచ్చు.
Heart Problem : గుండె పోటు రాబోతుందని శరీరం ముందే చెబుతుందా..!
పాలలో కొన్ని సహజమైన రుచులు, స్వీటెనర్లు, పసుపు కలుపుకోవచ్చు. పాలలో మంచి పౌడర్స్ కలిపి పిల్లలకు అలవాటు చేయవచ్చు.
బరువు తగ్గాలన్నా పాలను ఎంచుకుంటే సరిపోతుంది. కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. పాటు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. భోజనం తర్వాత తీసుకోవడం వల్ల కేలరూలు తగ్గుతాయి. బరువుతగ్గడానికి సహకరిస్తుంది. అంతే కాకుండా వ్యాయామం చేసిన తర్వాత పాలను తాగడం వల్ల కండరాలు అభివృద్ధి చెంది, శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది.
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి పాలకు మంచి గుణాలున్నాయి. ఆవుపాలు, మేకపాలు ఆరోగ్యానికి మద్దతుగా నిలుస్తాయి.
Health Tips : అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే 5 మూలికల గురించి తెలుసా..!
ఎవరు పాలను తగ్గించాలి..
పాలను త్రాగకూడని వారు ఎవరంటే.. లాక్టోస్ అసహనం, పాలతో అలెర్జీలు ఉన్నవారు, లాక్టోస్ చక్కెరను జీర్ణం చేసుకోలేకపోవడం, ఉబ్బరం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది.
ఉబ్బరం, అతిసారం, మధుమేహం లేదా రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా లేని వారు పాలలో లాక్టోస్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే సామర్థ్యాం ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 19 , 2024 | 03:40 PM