Which is better : తెలుపు, గోధుమ ఏ రకం బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది..!
ABN, Publish Date - Jul 20 , 2024 | 04:19 PM
వైట్ బ్రెడ్ పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ పోషకమైనదిగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అంతేకాదు విటమిన్ బి6, ఇ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, జింక్ కాపర్, మాంగనీస్ అధికంగా ఉన్నాయి.
బ్రెడ్‌ని అల్పాహారంగా తీసుకుంటూ ఉంటాం. చక్కని రుచితో పిల్లలు పెద్దలూ అంతా తినే బ్రెడ్ ఆరోగ్యకరమైన ఆహారంగా తింటూ ఉంటాం. టోస్ట్ చేసి, వెన్న రాసి, శాండ్ విచ్ లా అయినా, లేదా పాలలో ముంచుకుని తినేందుకుకైనా, బ్రెడ్ ఆమ్లేట్ కైనా చక్కని టేస్ట్ కట్టిపడేస్తుంది. ఆరోగ్యం బాగోనివారికి తప్పకుండా బ్రెడ్ పెడుతూనే ఉంటాం. అయితే మాక్రెట్లో అనేక రకాల బ్రెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటినీ సరైన పద్దతిలోనే తయారుచేసారా అనేది కాస్త అనుమానమే. వైట్ బ్రెడ్ చాలా ఏళ్ళుగా మనకు తెలిసిందే.. అయితే బ్రౌన్ బ్రెడ్ ఈమధ్యకాలంలో కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.
గోధుమ రొట్టె పూర్తిగా గోధుమలతో తయారుచేసేది. వైట్ బ్రెడ్ పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ పోషకమైనదిగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అంతేకాదు విటమిన్ బి6, ఇ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, జింక్ కాపర్, మాంగనీస్ అధికంగా ఉన్నాయి.
1. తెల్ల రొట్టె తయారీకి గోధుమ పిండిని బెంజాయిల్ పెరాక్సైడ్, క్లోరిన్ డయాక్లైడ్, పొటాషియం బ్రోమేట్ వంటి రసాయనాలను ఉపయోగించి బ్లీచ్ చేస్తారు. దీని కారణంగా పిండి తెల్లగా మారి కనిపిస్తుంది.
Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
2. వైట్ బ్రెడ్ లో ఫైబర్, పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ బ్రౌన్ బ్రెడ్ కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది.
3. బ్రౌన్ బ్రెడ్ కంటే వైట్ బ్రెడ్ లో ఎక్కవ కేలరీలు ఉంటాయి.
Milk Time : పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !
4. వైట్ బ్రెడ్ స్లైస్ లో 77 కేలరీలు ఉండే, బ్రౌన్ బ్రెడ్ స్లైస్ లో 75 కేలరీలు ఉన్నాయి.
5. వైట్ బ్రెడ్ తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
6. కేలరీల కంటెంట్ పరంగా, రెండు రకాల బ్రెడ్‌ల మధ్య పెద్దగా తేడా లేదు.
7. పోషకాల విషయానికి వస్తే, బ్రౌన్ బ్రెడ్ ఖచ్చితంగా వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
అయితే మార్కెట్‌లో లభించే అన్ని బ్రౌన్ బ్రెడ్‌లు ఆరోగ్యకరమైనవి కావు. తయారీదారులు కొన్నిసార్లు తెలుపు రొట్టెలో గోధుమ రంగులో కనిపించేలా రంగును కలుపుతారు. బ్రౌన్ బ్రెడ్ తినాలని ఎంచుకుంటే, పదార్థాల జాబితాలో కారామెల్ అనే పదాన్ని గమనించాలి. జాబితాలో 'పూర్తి గోధుమ' అనే పదం ఉన్నట్లయితే, అది గోధుమ ధాన్యంతో మాత్రమే తయారు చేసినట్టు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 20 , 2024 | 04:19 PM