ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లోనే ఎందుకు టైప్ 1 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ..!

ABN, Publish Date - Jul 24 , 2024 | 11:38 AM

ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు వచ్చే టైప్ 2 డయాబెటిస్ పిల్లలను ప్రభావితం చేస్తుంది.

Health Benefits

అమ్మాయిలతో పోల్చితే మధుమేహం సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని ఒక అధ్యయం తెలిపింది. చిన్న వయసు నుంచే ఈ వ్యాధి సోకడం వల్ల ఎదుగుదలలో అనేక మార్పులు కనిపిస్తాయి. సరైన ఉత్సాహవంతమైన బాల్యాన్ని గడపలేకపోవడం, ఆహారం విషయంలో ఆంక్షలు, ఆరోగ్యం సహకరించకపోవడం వంటి సమస్యలు బాల్యాన్ని కుచించుకుపోయేలా చేస్తాయి. దీనితో పెరుగుదలలోనూ మార్పులు కనిపిస్తాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

డయాబెటిస్ వచ్చే అవకాశం నేటి కాలంలో ఎక్కువగానే ఉంది. దీనికి ప్రధాన కారణం సరైన జీవన శైలి లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు, నిద్ర, ప్యాకింగ్ ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, జన్యపరమైన తేడాలతో, ఇలా చాలా కారణాలతో చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. ప్రోటీన్‌లను లక్ష్యంగా చేసుకునే రోగనిరోధక వ్యవస్థ ప్రోటీన్ లైన ఆటోఆంటీ బాడీ ఉన్న అబ్బాయిలకు ముఖ్యంగా T1D ప్రమాదం ఉన్నదని అధ్యయనం తెలిపింది. రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియ, లింగాల మధ్య ఇతర వ్యాత్యాసాలు వీరిలో డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతాయి.


Benefits of Vitamin C : చర్మ సౌందర్యానికి విటమిన్ సి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది?

1. పిల్లల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం మధుమేహానికి ప్రధాన కారణం.

2. యుక్తవయస్సు రాగానే జీవక్రియ రుగ్మత, అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు దారితీస్తుంది.

3. ఈ సమస్య గుండె, రక్తనాళాలలో, మూత్రపిండాలలో హాని కలిగించే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.

Human brain : మానవ మెదడు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..!


4. పిల్లల్లో కనిపించే మధుమేహ రకాలలో.. టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్, దీనికి జన్యపరమైన కారకాలు, పర్యావరణ కారకాలు, రోగనిరోధక వ్యవస్థ పనితీరు కారణం కావచ్చు.

5. టైప్ 1 డయాబెటీస్ 5 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది.

6. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు వచ్చే టైప్ 2 డయాబెటిస్ పిల్లలను ప్రభావితం చేస్తుంది.

Women Health : మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!

పిల్లల్లో మధుమేహం లక్షణాలు..

1. అలసట ఎక్కువగా ఉండటం. షుగర్ లెవల్స్ పెరగడం వల్ల అలసట, నిద్రపోయేలా చేస్తుంది.

2. తరచుగా మూత్రవిసర్జన.. అధిక చక్కెర స్థాయిలు కారణంగా బాత్రూమ్‌కు ఎక్కువగా వెళ్ళాలనుకోవడం ఉంటుంది.

3. అధిక దాహం.. రక్తలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం కావచ్చు.

4. బరువు తగ్గుతారు.. మధుమేహం కారణంగా గణనీయమైన స్థాయిలో బరువు తగ్గవచ్చు.

5. మగత, దృష్టిలోపం, భారీ శ్వాస, కడుపు నొప్పి, వాంతులు, మూర్చ లక్షణాలుంటాయి. ఈ లక్షణాలతో పిల్లల్లో చిన్న వయసులోనే మధుమేహం సమస్య పెరుగుతుంది. ఆహారం, వ్యాయామం విషయంలో మార్పులు చేయడం వల్ల చిన్న వయసులోనే ఈ సమస్య నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 24 , 2024 | 11:49 AM

Advertising
Advertising
<