Weight Loss : ఈ దోశతో బరువు ఇట్టే తగ్గొచ్చు.. ఎలా తయారు చేయాలంటే..!
ABN, Publish Date - Aug 09 , 2024 | 03:00 PM
బీట్ రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీల విషయానికి వస్తే ఇందులో తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడానికి సరైన ఆహారంగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ పెంచేందుకు సహకరిస్తుంది. సలాడ్, సూప్‌లలో ఓట్స్, బీట్ రూట్ మసాలా దోశ చక్కని అల్పాహారంగా ఉంటుంది.
ఉదయాన్నే టిఫిన్ తినకపోతే శరీరంలో శక్తి లేనట్టుగా ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి మళ్ళీ భోజనం ఇలా తినడం వల్ల శరీరం ఉండాల్సిన దానికన్నా అధిక బరువు పెరుగుతుంది. తిండి తగ్గిస్తే నీరసం తప్ప బరువు తగ్గే అవకాశం ఉండదు. ఆరోగ్యంగా సమతుల్య ఆహారం తీసుకుంటూ బరువు తగ్గాలంటే కాస్త మంచి ఆహారాన్ని తీసుకోవాలి. డైటింగ్ సమస్య లేకుండా బరువు తగ్గే విధంగా అల్పాహారంలో ఈ దోశను తీసుకుంటే బరువు సమస్య ఉండదట. దీని తయారీ విధానం తెలుసుకుందాం.
వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం అసాధ్యం. శరీరానికి తగిన వ్యాయామం, సమతుల్య ఆహారం రెండూ అవసరమే. బరువు తగ్గకపోవడానికి మనం తినే తిండి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ దోశలను తింటే సులభంగా బరువు తగ్గవచ్చు. ఓట్స్, బీట్రూట్ కలిపి చేసే ఈ దోశల్లో అనేక పోషకాలున్నాయి.
ఓట్స్‌లో ఉండే ఫైబర్ ఎక్కువసేపు ఆకలి కాకుండా, పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. శరీరంలో క్యాలరీలను నింపే విషయంలోనూ బరువు తగ్గించేందుకు ఓట్స్ చక్కని ఎంపిక. ఓట్స్‌లో ఉండే సాల్యుబుల్ ఫైబర్, బీటా గ్యూకాన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. కాబట్టి దీనితో చేసే దోశ ఆరోగ్యానికి మంచి శక్తిని అందిస్తుంది.
Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?
బీట్ రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీల విషయానికి వస్తే ఇందులో తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడానికి సరైన ఆహారంగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ పెంచేందుకు సహకరిస్తుంది. సలాడ్, సూప్‌లలో ఓట్స్, బీట్ రూట్ మసాలా దోశ చక్కని అల్పాహారంగా ఉంటుంది. ఇందులో కాంబినేషన్ మార్చాలనుకుంటే పనీర్, బంగాళా దుంపలను కూడా చేర్చుకోవచ్చు. ప్రోటీన్ తీసుకోవడం కూడా బరువు తగ్గడానికి సపోర్ట్ చేస్తుంది.
Health Tips : ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీరు తాగడం ఆరోగ్యమేనా..!
ఓట్స్, బీట్ రూట్ మసాలా దోశ..
1. ఓట్స్ రాత్రి నీళ్ళలో పోసి నాననివ్వండి. బీట్ రూట్ ఉడకబెట్టి మెత్తగా ప్యూరీలా రుబ్బుకోవాలి. రాత్రి నానబెట్టిన ఓట్స్ కూడా మెత్తని పిండిలా రుబ్బుకోవాలి.
2. ఓట్స్ పిండి, బీట్ రూట్, పెరుగు, ఉప్పు, గరం మసాలా కలిపి ఉంచాలి.
3. ఈ మృదువైన పిండిలో కొద్దిగా నీరు చేర్చి దోశలు వేసేందుకు సిద్ధం చేసుకోవాలి.
Health Tips : పొట్ట ఆరోగ్యాన్ని పెంచే పానీయం ఇదే.. !
4. ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలు, పనీర్, అల్లం, కొత్తి మీర పైన దోశ మీద వేసుకోవచ్చు. ఇవి కాస్త వేగి మరింత రుచిని ఇస్తాయి.
5. దోశను దోరగా వేగనిచ్చి, బంగారు రంగులోకి వచ్చాకా తీసుకోవడమే. బరువు తగ్గాలనుకునే వారికి ఈ దోశ అల్పాహారంగానే కాదు. రాత్రి డైట్లో కూడా చక్కని రుచికరమైన ఆహారంగా ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Aug 09 , 2024 | 03:08 PM