Technology : ఇలా చేస్తే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఓవర్ హీట్
ABN, Publish Date - Jun 08 , 2024 | 05:23 AM
వేడి ఏ రూపంలో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పవు. స్మార్ట్ ఫోన్‌కూ వర్తిస్తుంది. ఎండలనే కాదు, గేమ్స్ తదితరాలతో ఎక్కువగా ఉపయోగించినా ఫోన్ వేడెక్కుతుంది. ఫలితంగా ఇబ్బందులకూ అవకాశం ఉంటుంది. దరిమిలా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండాకాలమనే కాదు, బైటి వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ కేసును మొదట తొలగించాలి. ఇప్పుడు వస్తున్న ఫోన్లు ఎక్కువగా ఫాస్ట్-చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఆ నేపథ్యంలో కేసును తొలగించడం ద్వారా ఫోన్‌ను వేడిమి నుంచి రక్షించుకోవచ్చు.
కనీస స్థాయిలో డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ని ఉంచుకోవాలి. అది ఎక్కువగా ఉంటే ఫోన్ వేడెక్కుతుంది. ఆ కారణంగా, అవసరమైన మేరకు బ్రైట్‌నెస్‌ను అడ్జెస్ట్ చేసుకోవాలి.
బైట అంటే రోడ్డుపై ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌పై సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవాలి. అందుకోసం ఏదో ఒక అడ్డును ఏర్పాటు చేసుకోవాలి. వాహనంలో లేదంటే పైన ఏదో ఒక అడ్డు ఉండేలా చూసుకుంటే మంచిది.
వేడి వాతావరణంలో ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వినియోగం లేదంటే దాంట్లో ఆటలు అంత మంచిది కాదు. భారీ స్థాయిలో ఉండే గేమ్స్ ఆడేటప్పుడు హార్డ్‌వేర్‌ని బాగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వేడెక్కుతుంది. అందువల్ల అదేపనిగా ఆడకూడదు.
స్మార్ట్‌ఫోన్లను జేబులో ఉంచుకోకూడదు. సహజంగా సాగే ఎయిర్ ఫ్లోని అది నిరోధిస్తుంది. అలా కూడా వేడెక్కే ప్రమాదం ఉంది. సహజంగా సాగే గాలి ప్రక్రియకు అవకాశం కల్పించాలి.
Updated Date - Jun 08 , 2024 | 05:23 AM