ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Relationship Tips: ఈ రూల్స్ పాటించకపోతే మీది లవ్ మ్యారేజ్ అయినా బ్రేకప్ అవడం ఖాయం..

ABN, Publish Date - Nov 05 , 2024 | 11:51 AM

ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలకే యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఆ బంధం స్ట్రాంగ్‌గా ఉంటుందనే గ్యారెంటీ లేదు. ఏ రిలేషన్ అయినా.. స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి రూల్స్ ఏంటో తెలుసుకుందాం..

Relationship Tips

Relationship Tips: ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలకే యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఏమీ తెలియని వారిని పెళ్లి చేసుకోవడం కంటే.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఉత్తమం అని భావిస్తోంది నేటి యువత. అయితే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఆ బంధం స్ట్రాంగ్‌గా ఉంటుందనే గ్యారెంటీ లేదు. ఏ రిలేషన్ అయినా.. స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి రూల్స్ ఏంటో తెలుసుకుందాం..


కమ్యూనికేషన్:

లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీ భాగస్వామితో అన్ని విషయాలను షేర్ చేసుకోండి. మీ ఆలోచనలు, భావాలు, అవసరాలను పంచుకోండి. ఇలా మాట్లాడటం వల్ల అపార్థాలు తొలిగిపోవడమే కాకుండా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.


స్వేచ్ఛ:

మీ భాగస్వామికి ఎప్పటికప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వండి. అంటే మీరు ఒకరికొకరు పూర్తిగా దూరంగా ఉండాలని కాదు.. వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రతి విషయంలోనూ కండిషన్స్ పెడితే వారు మీతో పూర్తిగా సంతోషంగా ఉండలేరు.


గౌరవం:

ఏ బంధంలోనైనా గౌరవం చాలా ముఖ్యం. మీ భాగస్వామి ఆలోచనలు, వారి భావాలను గౌరవించండి. భార్యభర్తలు ఒకరినొకరు గౌరవించినప్పుడు ఆ బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా అందరిలో ఉన్నప్పుడు మీ భాగస్వామికి గౌరవం ఇవ్వకుండా హేళన చేయడం మీ బంధానికి ఏ మాత్రం మంచిది కాదు.


టైం:

ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు ఉద్యోగం అనే హడావిడిలో ఒకరికొకరు టైం ఇవ్వలేకపోతుంటారు. కానీ మీరు మీ భాగస్వామితో విలైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపండి. అది రొమాంటిక్ డిన్నర్ అయినా, సినిమా ప్లాన్ అయినా లేదా కలిసి నడవడం అయినా ఇలా మీరు మీ భాగస్వామితో సమయాన్ని గడపండి. ఇలా చేయడం ద్వారా మీ బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది.


అభినందించడం:

రిలేషన్ షిప్‌లో చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోకూడదు. ఒకరినొకరు అభినందించుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి వారి కృషిని అభినందిడం ద్వారా వారు సంతోషంగా ఉండేలా చేస్తుంది. ప్రతి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోండి.


సపోర్ట్‌:

ప్రతి బంధంలోనూ కష్టసుఖాలు ఉంటాయి. మీరు సానుకూలంగా స్పందించడం చాలా ముఖ్యం. కష్ట సమయంలో ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండండి. ఇలా ఎందుకు జరిగింది అని గొడవ పడకుండా నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి. అలా ఒకరినొకరు సమస్యలు వచ్చినప్పుడు తోడుగా ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది.


Also Read:

నుదిటి మీద మొటిమలు వస్తున్నాయా!

ఇన్‌ఫ్లమేషన్‌ ఇక్కట్లు

బ్లడ్‌ థిన్నర్స్‌ ఎందుకు?

Updated Date - Nov 05 , 2024 | 11:56 AM