ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kitchen : చెట్టినాడ్‌ వెజ్‌ కర్రీ

ABN, Publish Date - Oct 05 , 2024 | 01:37 AM

తమిళనాడులోని చెట్టినాడ్‌ ప్రాంత ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. చెట్టినాడ్‌ ప్రాంతంలో నాన్‌వెజిటేరియన్‌ మాత్రమే కాదు వెజిటేరియన్‌ వంటలు కూడా చాలా రుచిగా వండుతారు.

వంటిల్లు

తమిళనాడులోని చెట్టినాడ్‌ ప్రాంత ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. చెట్టినాడ్‌ ప్రాంతంలో నాన్‌వెజిటేరియన్‌ మాత్రమే కాదు వెజిటేరియన్‌ వంటలు కూడా చాలా రుచిగా వండుతారు. అలాంటి కొన్ని వంటలను హైదరాబాద్‌లోని బార్‌బెక్యూ నేషన్‌కు చెందిన చెఫ్‌ రాఽఘవేంద్ర మన ముందుకు తీసుకువస్తున్నారు.

  • కావాల్సిన పదార్థాలు:

చెట్టినాడ్‌ గ్రేవీ, కరివేపాకు- పావు కప్పు, నూనె- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- అర స్పూను, అన్ని రకాల కూరల ముక్కలు- రెండు కప్పులు, పనీర్‌ ముక్కలు- ఒక కప్పు, ఎండు మిరపకాయలు- 10, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

  • తయారీ విధానం:

  1. చెట్టినాడ్‌ గ్రేవీని ఒక గిన్నెలో వేయాలి. దానిలో తగినన్ని నీళ్లు పోసి- ఎక్కడా ఉండలు లేకుండా 15 నిమిషాలు సన్నని మంట మీద ఉడకపెట్టాలి.

  2. ఒక మూకుడులో కొద్దిగా నూనె వేసి కాగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. ఆ మిశ్రమంలో కూర ముక్కలు, పనీర్‌ ముక్కలు వేసి వేయించాలి.

  3. వేయించిన మిశ్రమంలో చెట్టినాడ్‌ గ్రేవీని వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేయాలి.


  • చెట్టినాడ్‌ గ్రేవీ తయారీ

  • కావాల్సిన పదార్థాలు:

ఎండు మిరపకాయలు-5, కొబ్బరి పొడి- మూడు స్పూనులు, ధనియాలు- రెండు స్పూనులు, జీలకర్ర- రెండు స్పూనులు, సోంపు- రెండు స్పూనులు, నల్ల మిరియాల పొడి- రెండు స్పూనులు, తరిగిన ఉల్లిపాయలు- రెండు, అల్లం- తగినంత, వెల్లుల్లి- మూడు, నువ్వుల నూనె- పావు కప్పు, నీళ్లు- తగినన్ని, ఉప్పు- తగినంత.

  • తయారీ విధానం:

  1. ఒక మూకుడులో నూనెను వేడిచేయాలి. దీనిలో ఎండు మిర్చి, కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాల పొడి వేసి వేయించాలి. దోరగా వేగిన

  2. తర్వాత వీటిని ఒక ప్లేటులోకి తీసి చల్లార్చాలి.

  3. మూకుడులో మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీలో వేసి ముద్దగా చేయాలి.

  4. ఈ ముద్దలో వేయించిన ఎండుమిర్చి, కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాల పొడిలను కలిపాలి. తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ జార్‌లో వేసి బాగా తిప్పాలి.

  • జాగ్రత్తలు

  1. చెట్టినాడ్‌ గ్రేవీలో తగినన్ని నీళ్లు పోయాలి. లేకపోతే పలచగా అయిపోతుంది.

  2. గ్రేవీలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఉంటుంది కాబట్టి కర్రీలో మరీ ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయాల్సిన అవసరం లేదు.

  3. ఈ కర్రీని చపాతీతో కానీ ఇదియప్పంతో కానీ తింటే చాలా బావుంటుంది.

Updated Date - Oct 05 , 2024 | 01:37 AM