ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Tourists: మంచు అందాలు చూడడం ఇష్టమా.. మన దగ్గరే ఉంది ఓ అందమైన గ్రామం

ABN, Publish Date - Nov 03 , 2024 | 08:29 AM

సరదాగా ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు వెళ్లాలనుకునేవారికి శీతాకాలం చాలా అనువుగా ఉంటుంది. వర్షకాలం లేదా వేసవి మాదిరిగా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అంతేకాదు ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు చలికాలం అద్భుతంగా ఉంటుంది. మరి మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న ఈ అందమైన గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారేమో..

Lambasingi

సరదాగా ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు వెళ్లాలనుకునేవారికి శీతాకాలం చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే వర్షకాలం లేదా వేసవి మాదిరిగా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అంతేకాదు ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు ఈ సీజన్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఏడాది శీతకాలం వచ్చేసింది. మరి మంచుతో కూడిన సుందర దృశ్యాలను వీక్షించాలనుకునే తెలుగు ఔత్సాహిక టూరిస్టులు ఎక్కడికో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. ‘ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్’గా పిలుచుకునే ‘లంబసింగి’ని సందర్శించి మంచు అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. పొగమంచుతో కప్పి ఉండే ఈ గ్రామాన్ని సందర్శించాలనుకునే హైదరాబాదీలు విమానం ఎక్కి నేరుగా విశాఖపట్నం వెళ్లిపోవచ్చు. అక్కడి నుంచి సులువుగా లంబసింగి చేరుకోవచ్చు.


సముద్ర మట్టానికి 1000 మీటర్లు ఎత్తు..

దక్షిణ భారతదేశంలో అరుదైన వాతావరణం, పొగమంచుతో కప్పి ఉండే ఏకైక హిల్ స్టేషన్ ఇదే కావడం గమనార్హం. ఇక్కడ ఉష్ణోగ్రతలు మంచు కురిసేంత తక్కువగా ఉంటాయి. ఇక్కడ అరుదైన వాతావరణం నెలకొని ఉంటుంది. అతిశీతలంగా, సుందరమైన లోయలు, ప్రకృతి అందాలు అబ్బురపరుస్తాయి. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి దాదాపుగా 1,000 మీటర్లు (3,280 అడుగులు) ఎత్తులో ఉంది. దక్షిణ భారతదేశంలో శీతాకాలం కురిసే మంచు దృశ్యాలను వీక్షించగలిగే ఏకైక ప్రదేశం లంబసింగి కావడం విశేషం. ఏడాదంతా ఇక్కడ హిమపాతం సంభవిస్తున్నప్పటికీ శీతకాలంలో ఇంకా ప్రత్యేకంగా కనిపిస్తుంది.


ఇక్కడ ఉండే గడ్డకట్టే చలి వాతావరణం కారణంగా కొన్నిసార్లు ఉదయం పూట మంచు స్ఫటికాలుగా మారి గ్రామాన్ని తెల్లటి పొర కప్పేసి ఉంటుంది. స్థానికులు లంబసింగిని ‘కొర్ర బయలు’ అని కూడా పిలుస్తుంటారు. ‘ఎవరైనా రాత్రిపూట బహిరంగ ప్రదేశంలో ఉంటే కర్రలా స్తంభించిపోతారు’ అని ఈ పదానికి అర్థం. ఎముకలు కొరికే చలి వాతావరణం ఇలా పిలుచుకోవడానికి కారణమైంది. చలి తీవ్రంగా ఉండే డిసెంబర్- జనవరి నెలల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు 0 నుంచి -2 ° సెంటిగ్రేడ్ స్థాయికి పడిపోతుంటాయి. ఇతర సీజన్లలో కూడా గ్రామం చాలా చల్లగా, పొగమంచు పడుతూ ఉంటుంది. చాలా రోజుల్లో ఉదయం 10 గంటల తర్వాత మాత్రమే సూర్య కిరణాలు పడతాయి.


లంబసింగిలో కనిపించే సుందరమైన లోయలు, దట్టమైన అడవులు, పర్వతాలు చాలా ఆహ్లాదకరంగా కనువిందు చేస్తాయి. కాఫీ తోటలు, యాపిల్ తోటలు, మిరియాల సాగు కనిపిస్తాయి. అంతేకాదు స్థానికంగా ఉండే గిరిజనులతో మాట్లాడడం కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. లంబసింగి గ్రామీణ జీవనశైలిని తెలుసుకోవచ్చు. గ్రామం అవతలి అందాలను చూడాలనుకునేవారికి కూడా సమీపంలోని కొన్ని సుందర ప్రదేశాలు ఉన్నాయి.


కొత్తపల్లి జలపాతం, సుసాన్ ఫ్లవర్ ఫీల్డ్స్, తాజంగి రిజర్వాయర్, కాఫీ తోటలు, యాపిల్ తోటలు, స్ట్రాబెర్రీ సాగు ఇలా దగ్గరలోనే కొన్ని సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

లంబసింగికి నేరుగా రైళ్లు లేవు. సమీపంలో చింతపల్లి రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి లంబసింగి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వెళ్లేవారు కాకినాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు కూడా చేరుకోవచ్చు. బస విషయానికి వస్తే లంబసింగిలో అంతగా సౌకర్యాలు లేవు. ఈ మధ్య హోమ్‌ స్టేలు ప్రారంభమయ్యాయి. సమీపంలో ఉన్న పెద్ద పట్టణం అయిన నర్సీపట్నంలో ఉన్న హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో బస చేయవచ్చు.

Updated Date - Nov 03 , 2024 | 08:47 AM