ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శీతాకాలం వేడి వేడిగా..!

ABN, Publish Date - Nov 23 , 2024 | 06:27 AM

శీతాకాలంలో వేడివేడి కూరలు తింటుంటే వచ్చే మజా వేరుగా ఉంటుంది. అలాంటి కొన్ని వంటకాలు ఎలా చేయాలో తెలుసుకుందాం...

శీతాకాలంలో వేడివేడి కూరలు తింటుంటే వచ్చే మజా వేరుగా ఉంటుంది. అలాంటి కొన్ని వంటకాలు ఎలా చేయాలో తెలుసుకుందాం...

జీడిపప్పు కోడికూర

కావాల్సిన పదార్థాలు

చికెన్‌ ముక్కలు- 750 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక స్పూను, కారం- ఒక స్పూను, పసుపు- రెండు స్పూనులు, నూనె- అరకప్పు, జీడిపప్పు- 150 గ్రాములు, గరం మసాలా- ఒక స్పూను, పెరుగు- ఒక కప్పు, తరిగిన కొత్తిమీర- రెండు స్పూనులు, ఉప్పు- తగినంత, నీళ్లు- రెండు కప్పులు, నెయ్యి- రెండు స్పూనులు

తయారీ విధానం

  • ఒక మూకుడులో నెయ్యి వేసి వేడి చేయాలి. 50 గ్రాముల జీడిపప్పును వేయించి చల్లార్చాలి. మిగిలిన జీడిపప్పును కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో ముద్దగా చేయాలి.

  • ఆ మూకుడులోనే నూనెను వేడి చేయాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా వేసి వేయించాలి.

  • ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత చికెన్‌ ముక్కలు వేయాలి. పెరుగు కూడా వేయాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి.

  • చికెన్‌ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దానిలో అల్లం వెల్లులి పేస్ట్‌, పసుపు, కారం, ఉప్పు వేయాలి. రెండు కప్పుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి.

  • ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్‌ వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

  • కూరను దింపే ముందు దానిలో వేయించిన జీడిపప్పు, తరిగిన కొత్తిమీర చల్లాలి.

జాగ్రత్తలు

  • చికెన్‌ ముక్కలు మరీ చిన్నగా.. లేదా మరీ పెద్దగా లేకుండా చూసుకోవాలి.

  • చిక్కటి పెరుగు వేస్తే రుచి చాలా బావుంటుంది.

  • పసుపు రెండు స్పూన్ల కన్నా ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే చిరు చేదు వస్తుంది.

బజ్జీ మిర్చీ కూర

కావాల్సిన పదార్థాలు

బజ్జీ మిర్చీ- అర కిలో, జీలకర్ర- ఒక స్పూను, నిమ్మరసం- 4 స్పూన్లు, నూనె- ఒక కప్పు, నువ్వులు- 100 గ్రాములు, తురిమిన ఎండు కొబ్బరి- 200 గ్రాములు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

తయారీ విధానం

  • బజ్జీ మిర్చీని బాగా కడిగి సగం చీరాలి.

  • నువ్వులు, తురిమిన ఎండు కొబ్బరిని కలిపి మిక్సీలో వేసి పొడి చేయాలి.

  • ఒక మూకుడులో నూనె వేసి వేడి చేయాలి. దానిలో బజ్జీ మిర్చీ వేసి వేయించాలి. వాటిని బయటకు తీసి చల్చార్చాలి.

  • మిగిలిన నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత నువ్వులు, ఎండుకొబ్బరి పొడిని వేసి వేయించాలి. దానిలో నీళ్లు వేసి ఉడకనివ్వాలి. కొద్ది సేపటి తర్వాత నూనె పైకి తేలుతుంది. అప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి.

  • నూనె పైకి తేలిన తర్వాత మిర్చీని వేసి బాగా ఉడకనివ్వాలి.

జాగ్రత్తలు

బజ్జీ మిర్చీని చీల్చకుండా నూనెలో నేరుగా వేయకూడదు. వేస్తే నూనె పైకి చిమ్మే ప్రమాదం ఏర్పడుతుంది.

ఈ కూరను అన్నంలో తినాలంటే కొద్దిగా పలచగా చేసుకోవచ్చు. చపాతీలలో తినాలంటే మాత్రం చిక్కగా చేసుకుంటే బావుంటుంది.


కోడిగుడ్డు సాలన్‌

కావాల్సిన పదార్థాలు

ఉడికించిన కోడిగుడ్లు- ఆరు, ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక స్పూను, కారం- ఒక స్పూను, పసుపు- పావు స్పూను, నూనె- అర కప్పు, చింతపండు గుజ్జు- అరకప్పు, ఉప్పు- తగినంత, వేరుశనగపప్పు- రెండు స్పూనులు, గసగసాలు- ఒక స్పూను, నువ్వులు- ఒక స్పూను, తురిమిన ఎండు కొబ్బరి- మూడు టేబుల్‌ స్పూనులు, ధనియాలు- ఒక స్పూను, జీలకర్ర- ఒక స్పూను, నీళ్లు- తగినన్ని

తయారీ విధానం

  • ఒక మూకుడులో గసగసాలు, నువ్వులు, వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసి పొడి చేయాలి.

  • ఉడకబెట్టిన కోడిగుడ్లపై పొర తీసి రెండేసి ముక్కలుగా చేయాలి.

  • ఒక మూకుడులో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేయించాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోయాలి.

  • ఈ నీళ్లలో ముందుగా చేసుకున్న పొడి.. చింతపండు గుజ్జు వేసి కలపాలి. బాగా ఉడికిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్డు ముక్కలను దీనిలో వేయాలి.

జాగ్రత్తలు

  • కోడిగుడ్లను ఎక్కువగా ఉడకబెట్టకూడదు. సగం ఉడకబెట్టిన గుడ్లు సరిపోతాయి.

  • చింతపండు గుజ్జు తగినంతే వేయాలి. ఎక్కువ అయితే సాలన్‌ రుచిలో తేడా వస్తుంది.

Updated Date - Nov 23 , 2024 | 06:27 AM