ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Benefits! : కాల్షియం కావాలా!

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:34 AM

శరీరానికి అత్యవసరమైన ఖనిజం కాల్షియం. ఇది ఎముకలు, దంతాలు, గోళ్లను బలంగా ఉంచుతుంది. కండరాల సంకోచం, నరాల పనితీరుకు సహకరిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలను అందించే కాల్షియం పూర్తి స్థాయిలో శరీరానికి అందాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం!

రీరానికి అత్యవసరమైన ఖనిజం కాల్షియం. ఇది ఎముకలు, దంతాలు, గోళ్లను బలంగా ఉంచుతుంది. కండరాల సంకోచం, నరాల పనితీరుకు సహకరిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలను అందించే కాల్షియం పూర్తి స్థాయిలో శరీరానికి అందాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం!

  • తాజా కూరగాయలు: దాదాపు అన్ని ఆకు కూరలు, కూరగాయల్లో ఎంతో కొంత కాల్షియం ఉంటుంది. కాలానుగుణంగా లభించే తాజా కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది.

  • నారింజ: ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజుకు కనీసం ఒక నారింజనైనా తింటూవుంటే ఎముకల మధ్య ఉండే కార్టిలేజ్‌ గట్టిపడుతుంది. కీళ్లవాతం రాకుండా ఉంటుంది.

  • బ్రకోలీ: ఇందులో కాల్షియంతోపాటు కె విటమిన్‌ కూడా ఉంటుంది. బ్రకోలీని వారానికి రెండుసార్లు తింటే ఎముకల్లో సాంద్రతను తగ్గించే వ్యాధులు రాకుండా ఉంటాయి. కీళ్ల అరుగుదలను నివారిస్తుంది.

  • నువ్వులు: నువ్వులను కూరల్లో, సలాడ్స్‌లో, స్వీట్లలో భాగంగా చేర్చి తింటూవుంటే శరీరంలో కాల్షియం లోపం అనేదే ఉండదు. బెల్లంతో కలిపి చేసే నువ్వుండలు పిల్లలకు మంచి పౌష్టికాహారం. ప్రతిరోజూ ఒక చెంచా మొతాదులో నువ్వులు తినడం మంచిది.

  • బాదాం: ప్రతిరోజూ బాదాంలను మంచి నీళ్లలో నానబెట్టి తింటూ ఉంటే శరీరానికి కావాల్సిన కాల్షియం మోతాదు మొత్తం అందుతుంది. కాబట్టి మిగిలిన ఆహార పదార్థాలు తీసుకొనేటప్పుడు వాటి నుంచి లభించే కాల్షియం పరిమాణాన్ని గమనించుకోవాలి.

  • చియా గింజలు: వీటిలో కూడా కాల్షియం సమృద్దిగా ఉంటుంది. వీటిని నీటిలో వేయగానే బాగా ఉబ్బి రుచికరంగా మారతాయి. ఓట్స్‌, పెరుగు, స్మూతీస్‌, యోగర్ట్‌తో చేర్చి చియా గింజలను తీసుకోవచ్చు.

  • సోయా: పాలలో కాల్షియం ఉంటుందని అందరికీ తెలుసు. కానీ పాలు, పాల పదార్థాలు తీసుకోవడం ఇష్టం లేనివారికి సోయా పాలు, సోయా టోఫు మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

Updated Date - Nov 16 , 2024 | 05:34 AM