Littles : గడ్డంలో గడ్డిపరక
ABN , Publish Date - Jul 06 , 2024 | 06:49 AM
మహేంద్రుడనే రాజు దగ్గర ఆనందుడనే తెలివైన మంత్రి ఉండేవాడు. అతరు ఎన్నో సమస్యలకు సులువుగా చిటికెలో పనిష్కారాలు చెప్పేవాడు.
మహేంద్రుడనే రాజు దగ్గర ఆనందుడనే తెలివైన మంత్రి ఉండేవాడు. అతరు ఎన్నో సమస్యలకు సులువుగా చిటికెలో పనిష్కారాలు చెప్పేవాడు. ఒకరోజు మహారాజుకు ఇష్టమైన రత్నాలహారం కనిపించకుండా పోయింది. దాన్ని ఎవరు దొండగిలించినా కఠిన శిక్ష తప్పదు అనుకున్నారు అంతా. రాజుగారి కొలువుఓ పనిచేసే అందరు పనివారిని ఒకరోజు ఒకే దగ్గరకు పిలిచాడు మంత్రి, రాజుగారి నగల పెట్టె లోకి చూసి, మహారాజా.. మీ నగ ఎవరు దొంగిలించారో నాకు మీ నగల పెట్టె ఆనవాలు చెప్పింది.
మీ నగ తీసుకున్న వ్యక్తి గడ్డంలో ఒక గడ్డి పరక ఉంటుందని నగల పెట్టె అంటోంది అన్నాడు గట్టిగా. అక్కడ ఉన్నర పనివారిలో ఒకడు తన గడ్డం పదేపదే తడుముకుని కంగారు పడటం గమనించిన మంత్రి మహారాజా ఇదిగో మీ హారం తీసుకున్న దొంగ అన్నాడు. ఆ పనివాడు బెదిరిపోయి, తప్పు ఒప్పుకుని, దొంగిలించిన నగను తెచ్చి రాజుకు ఇచ్చేశాడు. అందరూ మంత్రి సమయ స్ఫూర్తిని, తెలివి తేటలని మెచ్చుకున్నారు.