ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Littles : నిజాయితీకి పరీక్ష

ABN, Publish Date - Oct 02 , 2024 | 04:49 AM

అవంతీ పురం అనే రాజ్యాన్ని మహేంద్రుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు.అతనికి కుడి భుజంలాంటి మహామంత్రి ఒకరోజు అనారోగ్యం కారణంగా మరణించాడు. మహేంద్రుడు మంత్రి కుమారుడిని మంత్రి స్థానంలో నియమించాడు,పదవినైతే ఇచ్చాడు కానీ మహేంద్రుడికి అతని తెలివితేటలు ఏ పాటివో అతను ఆ పదవికి అర్హుడేనా అని పరీక్ష పెట్టాలి అనిపించింది.

Littles : వంతీ పురం అనే రాజ్యాన్ని మహేంద్రుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు.అతనికి కుడి భుజంలాంటి మహామంత్రి ఒకరోజు అనారోగ్యం కారణంగా మరణించాడు. మహేంద్రుడు మంత్రి కుమారుడిని మంత్రి స్థానంలో నియమించాడు,పదవినైతే ఇచ్చాడు కానీ మహేంద్రుడికి అతని తెలివితేటలు ఏ పాటివో అతను ఆ పదవికి అర్హుడేనా అని పరీక్ష పెట్టాలి అనిపించింది. వెంటనే మంత్రి కుమారుడిని పిలిపించి, ఇలా చెప్పాడు ‘ మన రాజభవనంలో పని చేయడానికి ఒక నమ్మకమైన ఉద్యోగి కావాలి.

అతను చాలా నిజాయితీపరుడై ఉండాలి అటువంటి వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. మీనాన్న బ్రతికి ఉన్నపుడు ఇలాంటి చిక్కు సమస్యలు అన్నిటినీ ఆయనే పరిష్కరించే వాడు ఇపుడు నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలి.అన్నాడు అలాగే మహారాజా అని వెళ్లిపోయిన మంత్రి కుమారుడు ఆ మర్నాడు ఉద్యోగం కోసం వచ్చిన పదిమంది యువకులతో కాసేపు మాట్లాడి, వారందరినీ కొంతసమయం ఒక గదిలోకి పంపి, అందరూ బయటకు వచ్చిన తరువాత, ఆ పదిమందినీ రాజుగారి చుట్టూపరిగెత్తమన్నాడు వారిలో తొమ్మిది మంది ఇదేమి వింత పరీక్షఅని పరిగెత్తడానికి నిరాకరించారు.


ఒకే ఒక యువకుడు మాత్రం పరుగు తీసాడు మంత్రి కుమారుడు ఆ యువకుడిని రాజు గారికి చూపించి, మహారాజా.. ఇతనే మీకు కావలసిన నిజాయితీపరుడు ఇతన్ని మీరు పూర్తిగానమ్మవచ్చు’ అన్నాడు అది విన్న రాజుగారు అలా ఎలా చెప్పగలవు? నాచుట్టూ నదిసార్లు నరిగెడితే మనిషిలో నిజాయితీ తెలిసిపోతుందా; ఇదేమిపరీక్షఅని అడిగాడు దానికి మంత్రి కుమారుడు ‘మహారాజా.. మీ చుట్టూ పరుగు తీయడం కాదు వీరందరికీ అసలు పరీక్ష ఆ చీకటి గదిలోనే ముగిసింది, నేను ఈ పదిమందిని బంగారు నాణాలు రాశులుగా పోసి ఉన్న ఒక చీకటి గదిలో కాసేపు ఉండమని చెప్పాను వారిలో తొమ్మిదిమంది పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగి తనను ఎవరూచూడటంలేదనుకున్నట్లు, పట్టినన్ని బంగారు కాసులు తమ జేబులలో నింపుకున్నారు. మీ చుటూ టపరిగెడితే ఆ నాణాల చప్పుడుకు వారి దొంగతనం బయట పడుతుందనే భయం వల్లనే పరుగు తీయడానికి నిరాకరించారు. ఇక పోతే, ఈ యువకుడు మాత్రం ఆ చీకటి గదిలోఉన్నపుడు బంగారు కాసుల వైపు చూడనైనాలేదు అందుకేఅంత ధైర్యంగాపరుగు తీసాడు’ ఇతనే మీకు కావలసిన నిజాయితీపరుడైన ఉద్యోగి’ అన్నాడు. మంత్రి కుమారుడికి మంత్రి పదవిని ఇచ్చి తానుతప్పు చేయలేదని, తెలివైన చురుకైన యువకుడు మంత్రిగా లభించడం రాజ్యానికి చాలా మంచిజరుగుతుందని ఎంతోసంతోషించాడు మహేంద్రుడు.

Updated Date - Oct 02 , 2024 | 04:49 AM