ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Story : సరైన చోటు

ABN, Publish Date - Aug 12 , 2024 | 11:16 PM

పాంచాల పురాన్ని పాలించే విక్రముడు అనే రాజు ఆనందుడు అనే ముని పుంగవుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ గురువు శిక్షణలో అన్ని విద్యల్లో ఆరితేరి, మంచి పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక గురుపూర్ణిమ రోజు విక్రముడికి తన గురువును దర్శించుకొని తనను అంత వాడిని చేసినందుకు ధన్యవాదాలు చెప్పాలి అనిపించింది.

పాంచాల పురాన్ని పాలించే విక్రముడు అనే రాజు ఆనందుడు అనే ముని పుంగవుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆ గురువు శిక్షణలో అన్ని విద్యల్లో ఆరితేరి, మంచి పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక గురుపూర్ణిమ రోజు విక్రముడికి తన గురువును దర్శించుకొని తనను అంత వాడిని చేసినందుకు ధన్యవాదాలు చెప్పాలి అనిపించింది. గురువు దగ్గరకు వెళుతూ తనతోపాటు విలువైన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు వజ్రాలు కూడా తీసుకువెళ్లి, కానుకగా స్వీకరించమని అర్థించాడు. ఆనందుడు తన శిష్యుడిని నిరాశ పరచడం ఇష్టం లేక వాటిని స్వీకరించాడు. ఆ మర్నాడు విక్రముడికి దారి పక్కన చెట్ల కింద నివాసం ఉండే కొందరు పేదవారి దగ్గర విలువైన బంగారు నగలు పట్టు బట్టలు కనిపించాయని భటులు చెప్పారు. అవి వారికి ఎలా వచ్చాయో కనుక్కొని రమ్మని భటులను పంపాడు రాజు.

ఆ బట్టలు నగలను అంతకు ముందు రోజు ఆనందుడు అనే ముని తమకు దానంగా ఇచ్చినట్లు చెప్పారు ఆ పేదవారు. అది విన్న విక్రముడికి కొంచెం కోపం వచ్చింది. తాను ఎంతో గౌరవంతో గురువుగారికి ఇచ్చిన కానుకలను అలా కడు పేద వారికి ఎలా దానం చేశాడని గురువు పట్ల చిరాకు పడి తరువాతిరోజు మరలా గురువు గారి ఆశ్రమానికి వెళ్లి, ఎందుకిలా చేశారని గురువు గారిని అడిగాడు. దానికి ఆనందుడు ‘విక్రమా.. సర్వ సంగ పరిత్యాగినైన నేను ఈ విలువైన దుస్తులు నగలను ఏం చేసుకుంటాను? అదే మంచి తిండికి కూడా నోచుకోని ఆ పేదవారు ఒక్క నగలేదా విలువైన వస్త్రం అమ్ముకున్నా వారి కుటుంబాలు కడుపు నిండా భోజనం చేయగలుగుతాయి, కాబట్టి నాకన్నా వాటి అవసరమున్న వారి దగ్గర ఉండటమే ఆ కానుకలకు సరైనచోటు’ అన్నాడు ఆనందుడు.

ఆ మాటలలో నిజాన్ని గమనించిన విక్రముడు తన రాజ్యంలో పేద వారందరికీ పని కల్పిస్తాననీ అందరికీ కనీస సౌకర్యాలు ఉండేటట్టు చూస్తాననీ గురువుకు మాట ఇచ్చి, ఆ ప్రకారమే చేసి ధర్మప్రభువు అనే పేరు తెచ్చుకున్నాడు.

Updated Date - Aug 12 , 2024 | 11:16 PM

Advertising
Advertising
<