Story : నిజాయితీకి పరీక్ష!
ABN, Publish Date - Jun 03 , 2024 | 11:19 PM
సౌగంధపురం అనే దేశాన్ని నరేంద్ర భూపతి అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర పనిచేసే కోశాధికారి మరణించటంతో నిజాయితీపరుడైన ఒక ఉద్యోగి అవసరమయ్యాడు. మహామంత్రిని పిలిచి నమ్మకస్తుడైన
సౌగంధపురం అనే దేశాన్ని నరేంద్ర భూపతి అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర పనిచేసే కోశాధికారి మరణించటంతో నిజాయితీపరుడైన ఒక ఉద్యోగి అవసరమయ్యాడు. మహామంత్రిని పిలిచి నమ్మకస్తుడైన వ్యక్తిని ఎంపిక చేయమని ఆదేశించాడు. మహామంత్రి కొందరు యువకులను ఎంపిక చేసి వారందరిని ఒక పరీక్ష పెట్టాడు. గదిలో ఉన్న ఒక విగ్రహం చుట్టూ వేగంగా పది సార్లు పరిగెత్తాలి. పరీక్షకు వచ్చిన వారిలో ఒక యువకుడు తప్ప మిగిలిన వారందరూ ఏదో ఒక సాకు చెప్పి పరిగెత్తలేదు. మహామంత్రి పరిగెత్తిన యువకుడిని కోశాధికారిగా ఎంపిక చేసి రాజు దగ్గరకు పంపాడు. ‘‘ఈ యువకుడిని మీరు ఎందుకు ఎంపిక చేశారు’’ అని మహామంత్రిని రాజు అడిగాడు. అప్పుడు మహామంత్రి - ‘‘రాజా! యువకులందరినీ ముందుగా బంగారు నాణేలు ఉన్న ఒక చీకటి గదిలో ఉంచా. ఒక్కరు తప్ప మిగిలిన వారందరూ- బంగారు నాణేలకు తన దుస్తుల్లో దాచుకున్నారు. విగ్రహం చుట్టూ పరిగెత్తమన్నప్పుడు- వారు బంగారు నాణేలు కిందపడతాయనే భయంతో పరిగెత్తలేదు. వారెవ్వరూ నిజాయితీపరులు కారు. అందుకే ఈ యువకుడిని ఎంపిక చేశా’’ అని చెప్పాడు.
Updated Date - Jun 03 , 2024 | 11:19 PM