ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆవుల ధైర్యం

ABN, Publish Date - May 05 , 2024 | 12:15 AM

ఒక ఊరిలో మూడు ఆవులుండేవి. అవన్నీ స్నేహితులు. అడవికి వెళ్లినా నీళ్లు తాగటానికి వెళ్లినా కలిసి వెళ్లేవి. కుంటల్లో, కొలనుల్లో ఎక్కువ సమయం గడిపేవి.

క ఊరిలో మూడు ఆవులుండేవి. అవన్నీ స్నేహితులు. అడవికి వెళ్లినా నీళ్లు తాగటానికి వెళ్లినా కలిసి వెళ్లేవి. కుంటల్లో, కొలనుల్లో ఎక్కువ సమయం గడిపేవి. మూడింటికి దూడలున్నాయి. ఒక రోజు అడవిలో గడ్డి మేస్తున్న ఆవుల దగ్గరకు ఒక ఎలుగుబంటి పరిగెత్తుకొచ్చింది. ‘నాలుగు పులులు వస్తున్నాయి.

పరిగెత్తండి’ అంటూ అరిచింది. ఆవులు పరిగెత్తపోయినపుడు క్షణాల్లో నాలుగు పులులు చుట్టుముట్టాయి. ఆవులు భయపడలేదు. పైగా కొమ్ములు రువ్వాయి. ‘ఆవులు సాధు జంతువులు అనుకున్నా.

ఇవేంటీ కొమ్ములు రువ్వుతున్నాయి’ అంటూ చెట్టుమీద కోతి అరిచింది. ‘ఈ ఆవులు గతంలో సింహాలనే వెంబడించి చంపాయి’ అంటూ ఓ చిలుక చిటారుకొమ్మపైన జామపండు పొడుస్తూ గట్టిగా చెప్పింది.

వీటితో కొట్లాడితే మా ప్రాణాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని పులులు భయపడ్డాయి.

మూడు ఆవులూ లోపల భయంగా ఉన్నాయి. కానీ బయటికి ధైర్యాన్ని చూపించాయి. ఒక ఆవు ఇలా అంది. ‘మనం ఇంటికి వెళ్లాలి. మన పిల్లలు ఎదురు చూస్తుంటారు’ అన్నది. ఆవులు ఇంటికి బయలుదేరాయి. ఒక పులికి ఇగో దెబ్బతింది.

ఒక్క ఉదుటున ఆవుమీదకు ఎగిరింది. ఆ ఆవు కొమ్ములతో ఎత్తివేసింది. కడుపు దగ్గర కొమ్ములు తగిలి పులి బిక్కచచ్చి పడిపోయింది. ఈ అడవిలో మాకంటే బలవంతులు ఆవులేమో అనుకుని పులులన్నీ వెనక్కి తగ్గాయి.

Updated Date - May 05 , 2024 | 12:15 AM

Advertising
Advertising