కోపం వల్ల నష్టం
ABN, Publish Date - Aug 28 , 2024 | 06:22 AM
ముకుందాపురంలో రాజయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతనికి రాము అనే కొడుకు ఉన్నాడు. రాము మంచివాడే కానీ, అతనికి కోపం ఎక్కువ. అయిన దానికి, కాని దానికి తన తండ్రి దగ్గర పనిచేసే నౌకర్ల మీద కోప్పడుతూ ఉండేవాడు తరువాతి రో
ముకుందాపురంలో రాజయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతనికి రాము అనే కొడుకు ఉన్నాడు. రాము మంచివాడే కానీ, అతనికి కోపం ఎక్కువ. అయిన దానికి, కాని దానికి తన తండ్రి దగ్గర పనిచేసే నౌకర్ల మీద కోప్పడుతూ ఉండేవాడు తరువాతి రోజుల్లో ఆ వ్యాపారాన్ని దుకాణాన్ని మొత్తం రాముకే అప్పజెప్పాలనే ఆలోచనతో ఉన్న రాజయ్యకు రాము నోటి దురుసు ప్రవర్తన చాలా ఆందోళన కలిగించేది. ఎన్నోసార్లు పనివారు రాము ఉన్నపుడు పనికి రావడం ఇష్టపడకపోవడం గమనించి, రాముకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు రాజయ్య. కానీ రాము వినేవాడు కాదు ముందు కోప్పడినా తరువాత వారితో బాగానే మాట్లాడుతున్నాను కదా అనేది రాము వాదన.
ఇక ఒకరోజు రాజయ్య రామును ఒక చెక్క తలుపు వద్దకు తీసుకువెళ్లి, రామూ ఇలా చూడు ఇకపై నీకు కోపం వచ్చినప్పుడల్లా, ఎవరి మీదా అరవకుండా ఈ తలుపుకు ఒక మేకు కొడుతూ ఉండు అని చెప్పి, ఒక సుత్తె కొడుకు చేతిలో పెట్టాడు. సరే నాన్నా అని వెళ్లిపోయాడు రాము. కొన్ని రోజుల తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు ఆ తలుపు వద్దకు వచ్చి చూడగా, అది నిండా మేకులతో ఎంతో అందవిహీనంగా వికారంగా కనబడింది. దాన్ని కొడుక్కి చూపిస్తూ రాజయ్య ఇలా అన్నాడు ‘చూసావా ఈ తలుపు లాగే నువ్వు కూడా కోపంతో అరుస్తున్నపుడు వికారంగా కనబడతావు’ కాబట్టే కొంచెం కోపం తగ్గించుకో’ అన్నాడు.
అలాగే నాన్నా అని చెప్పి వెళ్లిపోయాడు రాము. కొన్నాళ్లకు రామును పిలిచి మరలా ఇలా చెప్పాడు రాజయ్య ‘నువ్వు ఎవరినైనా తిట్టి, మరలా వారికి క్షమాపణ చెప్పినప్పుడల్లా ఈ తలుపుకు కొట్టి ఉన్న మేకులలో నుంచి ఒక్కో మేకును ఊడదీయి అని చెప్పాడు. అలాగే నాన్నా అన్నాడు రాము. మరికొన్ని రోజుల తరువాత మరలా ఇద్దరూ ఆ తలుపు వద్దకు వచ్చారు. అపుడు రామును చూసి రాజయ్య ఇలా అన్నాడు మేకులన్నీ తొలగించినా కూడా తలుపు మొత్తం చిల్లులు పడి ఎంత అసహ్యంగా అయిపోయిందో చూసావా? అలాగే నువ్వు మొదట తిట్టి తరువాత క్షమాపణ చెబితే వాళ్ల మనసులో బాధ కూడా ఇలాగే ఉండిపోతుంది, పూర్తిగా మాసిపోదు’ అన్నాడు ఆ రోజుతో తన తప్పు ఏమిటో అర్ధం చేసుకున్న రాము ఆ మర్నాటినుండి అందరితో నెమ్మదిగా స్నేహంగా మసలుకోవడం అలవాటు చేసుకున్నాడు.
Updated Date - Aug 28 , 2024 | 06:22 AM