ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దురాశ దుఃఖానికి హేతువు

ABN, Publish Date - Jul 26 , 2024 | 02:23 AM

రామాపురంలో ఉండే వీరదాసు అనే రైతుకు తాను చాలా ధనం సంపాదించి రాత్రికురాత్రి సంపన్నుడిని అయిపోవాలని చాలా కోరిక. ఒక రోజు అతను పొలం దున్నుతూ ఈ పొలంలో నాకు కాస్త బంగారం దొరికితే నా దశ తిరిగిపోతుంది కదా దేవతలు దీవిస్తే బాగుండు అనుకున్నాడు. సరిగ్గాఅపుడే అతని నాగలికి భూమిలో ఏదో గట్టిగా తగిలింది, ఏమిటా అని

రామాపురంలో ఉండే వీరదాసు అనే రైతుకు తాను చాలా ధనం సంపాదించి రాత్రికురాత్రి సంపన్నుడిని అయిపోవాలని చాలా కోరిక. ఒక రోజు అతను పొలం దున్నుతూ ఈ పొలంలో నాకు కాస్త బంగారం దొరికితే నా దశ తిరిగిపోతుంది కదా దేవతలు దీవిస్తే బాగుండు అనుకున్నాడు. సరిగ్గాఅపుడే అతని నాగలికి భూమిలో ఏదో గట్టిగా తగిలింది, ఏమిటా అని తీసి చూస్తే అదొక చిన్న నగల పెట్టె. అందులో ఒక బంగారు నాణెం ఉంది. దాన్ని అతను చేతిలో పట్టుకుని చూస్తూ ఉంటే ఆ పెట్టెలోనుంచి ఒక స్వరం ఇలా మాట్లాడింది ‘వీరదాసూ.. ఈ బంగారు నాణం తీసుకో, ఈ పెట్టెలో నువ్వు చెయ్యి పెట్టినపుడల్లా ఒక నాణెం చేతికి వస్తుంది. అలా నీకు ఎంత బంగారం అవసరమో తీసుకుని, నీకు చాలు అనిపించగానే ఈ పెట్టెను నదిలో పారవేయి. పెట్టెను నదిలో పారేశాకనే నీకు ఆ డబ్బు ఖర్చు చేసే అఽధికారం వస్తుంది. గుర్తు పెట్టుకో’అన్నది ఆ స్వరం. దాన్ని దేవుని వరంగా, స్వరంగా భావించిన వీరదాసు ఇంటికి వెళ్లి, నిమిషానికి ఒకసారి పెట్టెలో చేయి పెడుతూ ఒకో బంగారు నాణెం తీసుకుని సంచీలో మూటలు కడుతూ రెండు రోజులు కూర్చున్న చోట నుండి లేవకుండా, బంగారం పోగేస్తూనే ఉన్నాడు. పెట్టె నదిలో పారవేయాలన్న విషయం గుర్తుకు రాగానే అది ఇష్టం లేక అతనికి ఏడుపు వచ్చేది. నాకు సరిపోయింది అనిపించే వరకు బంగారం తీసుకోవచ్చు కదా అని, అతను పెట్టె పారవేసే పనిని వాయిదా వేస్తూ వచ్చాడు. అలా ఒకేచోట కూర్చుని, బంగారంతో సంచులు నింపుతూ, నిద్ర,ఆహారం కూడా మానేసిన వీరదాసు తీవ్ర అనారోగ్యం పాలయినాడు.

నీతి: ఆశకు హద్దు లేకపోతే, అది మన ప్రాణాలనే తీస్తుంది.

Updated Date - Jul 26 , 2024 | 02:23 AM

Advertising
Advertising
<