ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Story : కష్టార్జితం

ABN, Publish Date - Jun 27 , 2024 | 11:18 PM

సిరిపురంలో ఉండే రాజారాం అనే యువకుడికి చదువు మీద కానీ మరే ఇతర పని మీద కానీ పెద్దగా ఆసక్తిలేదు. అతని స్నేహితులంతా ఏదో ఒక వృత్తిలో స్థిరపడి వివాహాలు చేసుకుని, కుటుంబాలతో జీవనం గడపసాగారు. రాజారాం తన తండ్రి వత్తకు వెళ్లి, తనకు కూడా పెళ్లి చేయమని అడిగాడు.

సిరిపురంలో ఉండే రాజారాం అనే యువకుడికి చదువు మీద కానీ మరే ఇతర పని మీద కానీ పెద్దగా ఆసక్తిలేదు. అతని స్నేహితులంతా ఏదో ఒక వృత్తిలో స్థిరపడి వివాహాలు చేసుకుని, కుటుంబాలతో జీవనం గడపసాగారు. రాజారాం తన తండ్రి వత్తకు వెళ్లి, తనకు కూడా పెళ్లి చేయమని అడిగాడు. దానికి వాళ్ల నాన్న అలాగే చ్తోను కానీ ముందుగా నాకో పదివేలరూపాయలు తెచ్చివ్వు. అపుడు నీకు మంచి వధువును చూసి వివాహం జరిపిస్తాను అన్నాడు. ఆ మర్నాడు రాజారాం ధనవంతుడైన తనస్నేహితుని దగ్గర పదివేలు అప్పుగా తీసుకుని తెచ్చి వాళ్ల నాన్న చేతికి ఇచ్చాడు. వాళ్ల నాన్నఆ డబ్బు తీసుకుని, పారవేశాడు అతను ఎందుకలా చేశాడో రాజారాంకి అంతు పట్టలేదు. మరొక వారం ఆతర్వాత రాజారాం వాళ్ల అమ్మను అడిగి మరో పదివేలు తీసుకుని తెచ్చి వాళ్ల నాన్న చేతికి ఇచ్చాడు. వాళ్ల నాన్న ఈ డబ్బును కూడా అంతకు ముందు లాగే పారవేశాడు. మరి కొన్ని రోజుల తర్వాత, రాజారాం ఇంకో పదివేలు తెచ్చి వాళ్ల నాన్న చేతికి ఇచ్చాడు. వాళ్ల నాన్న ఆ డబ్బు పారవేయబోతూ ఉంటే, రాజారాం వాళ్ల నాన్నచేతిని పట్టుకుని ఆపి, ‘ఆగండినాన్నా, ఇది నేను నెల రోజులు కష్టపడి పనిచేసి, సంపాదించిన డబ్బు, దయచేసి దీన్ని పారవేయకండిఅని అన్నాడు. దానికి వాళ్ల నాన్న ‘చూసావా? గతంలో రెండు సార్లు నేను డబ్బు పారవేసినపుడు నీకు కలగని బాధ ఇపుడుకలిగింది. నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు కాబట్టి, నీకు దీని విలువ తెలియాలనే నేను నువ్వు అడిగి తెచ్చిన డబ్బు పారవేశాను. ఇపుడు నీకు వివాహం చేసే సమయం వచ్చింది’ అన్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకు రాజారాంచేత మంచి వ్యాపారం పెట్టించి, అతనికి ఘనంగా వివాహం జరిపించాడు వాళ్ల నాన్న.

Updated Date - Jun 27 , 2024 | 11:18 PM

Advertising
Advertising