ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Story : అడవికి రాజు... తెలివిలో ఘనాపాటి!

ABN, Publish Date - May 24 , 2024 | 05:02 AM

సింహం చాలా తెలివైనదని అందరూ చెప్పుకునేవాళ్లు. ఎందుకంటే.. చెప్పుడు మాటలు వినదు. పైగా ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. మృగరాజు మాట అంటే మాటే. జంతువులన్నీ ఆ మాటకు కట్టుబడి ఉండేవి.

సింహం చాలా తెలివైనదని అందరూ చెప్పుకునేవాళ్లు. ఎందుకంటే.. చెప్పుడు మాటలు వినదు. పైగా ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. మృగరాజు మాట అంటే మాటే. జంతువులన్నీ ఆ మాటకు కట్టుబడి ఉండేవి.

ఒకరోజు రాజుగారు అడవి జంతువులకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని జంతువులూ హాజరయ్యాయి. అడవికి రాజు కావాలనే ఆశ పులి, నక్కకు ఉంది. అయితే అవి మనసులోనే ఎప్పటినుంచో బాధపడుతున్నాయి. మేము మీ సహాయకుడిగా ఉంటానని నక్క అడిగింది రాజుగారిని. ‘అవసరం లేదు’ అన్నది సింహం. ‘మీకు మంత్రిగా ఉంటాను’ అనడిగింది పులి. ‘మాకేమి కావాలో బాగా తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేద’న్నది సింహం. ఎదురుగా గజగజ వణుకుతూ ఉండే కుందేలుని దగ్గరకు రమ్మని సింహం పిలిచింది. ‘ఈరోజు నుంచి నువ్వే నా బాగోగులు చూడాలి’ అన్నది. నా గుహ దగ్గరే నీ ఇల్లు అని చెప్పింది. అయిష్టంతోనే.. నేను శాకాహారిని.. రాజుగారు అన్నది. ‘తెలుసు కాబట్టే నువ్వే మాకు సహాయంగా ఉండాలి’ అన్నది. రాజు దగ్గర సహాయకుడిగా కుందేలు ఉండేది. అప్పుడప్పుడు అడవిలోకి వెళ్లి ఇష్టమైన ఆహారం తినేసి వచ్చేది. ఆ సమయంలోనే కుందేలును కలిసి నక్క ఒక ఉపాయం చెప్పింది. రాజుగారికి తెలిస్తే ఎలా? అన్నది కుందేలు. ‘అది అసంభవం’ అన్నది.

ఒకరోజు కుందేలు పరిగెత్తుకొచ్చింది. ‘రాజావారు దగ్గర కొలనులో ఓ సింహం ఉంది. ఈ అడవికి ఇదే రాజంట’ అన్నది. కుందేలుతో కలిసి సింహం బయలుదేరింది. కొలనులో సింహం రూపం కనిపించింది. ‘నేను ఎంత అందంగా ఉన్నానో కదా!’ అని కుందేలును అడిగింది. నీటి కొలను ముందు గాండ్రించింది. దూరంగా ఉండే నక్కకు ఈ మాటలేవీ వినపడలేదు. పరిగెత్తుకుంటూ క్షణాల్లో నక్క వెనకాలే సింహం దగ్గరకు వచ్చి ఆగింది. ‘రాజుగారూ.. నీళ్లలో దూకి ఆ పొగరుబట్టిన సింహాన్ని సంహరించండి’ అన్నది. నీళ్లలోకి దూకినట్లు ముందుకు ఎగిరి.. క్షణాలో వేగంగా వెనక్కి వచ్చింది. ‘ఓహో.. తమరి తర్ఫీదా ఇది’ అంటూ నక్క గొంతును కొరికేసింది సింహం. ‘చెప్పుడు మాటలు ఇకమీదట వింటే నీకిదే గతి’ అంటూ కుందేలుతో అన్నది. గజగజవణుకుతూ ‘ఈసారి క్షమించండి’ అన్నది. ‘నీ మనసు నాకు తెలుసు. నా తెలివి నీకు తెలుసు’ అంటూ సింహం నవ్వింది. కుందేలు కూడా గట్టిగా నవ్వింది.

Updated Date - May 24 , 2024 | 05:02 AM

Advertising
Advertising