Littles : గాడిద నేర్చుకున్న పాఠం
ABN, Publish Date - Sep 03 , 2024 | 12:34 AM
ఒక ఊరిలో రాజు అనే వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. రాజు ప్రతి రోజు నగరంలోని సంతకు వెళ్లి, సరుకులు కొనుగోలు చేసి, ఆ సరుకుల మూటలను గాడిద మీద వేసుకుని తెచ్చి, తన పల్లెలో అమ్మేవాడు.
Littles : ఒక ఊరిలో రాజు అనే వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. రాజు ప్రతి రోజు నగరంలోని సంతకు వెళ్లి, సరుకులు కొనుగోలు చేసి, ఆ సరుకుల మూటలను గాడిద మీద వేసుకుని తెచ్చి, తన పల్లెలో అమ్మేవాడు.ఒకరోజు రాజు ఉప్పు మూటలను కొని గాడిద వీపు మీద వేసి తిరిగి వస్తుండగా, దారిలోఉన్న ఒక నీటి మడుగును చూసుకోకపోవడం వల్ల, గాడిద మూటలతో సహా ఆ నీళ్లలో పడిపోయింది. నీళ్లలో నుండి లేచాక ఉప్పు చాలా కరిగిపోవడం వల్ల గాడిదకు వీపు మీది బరువు తగ్గి చాలా హాయిగా అనిపించింది. ఆ మర్నాడు కూడా రాజు ఉప్పు మూటలే కొనుగోలు చేయడంతో ఈసారి కావాలనే గాడిద నీటిలో పడిపోయింది. వరుసగా మూడు రోజులు ఇలాగే ఉప్పు మూటలను నీటిలో పడవేస్తూ, తన బరువును తగ్గించుకుంటూఉంది.
ఆ రోజు రాజు గాడిద కావాలనే నీటిలో పడిపోయి తనకు నష్టం చేస్తుందని గమనించాడు. దీనికి ఎలాగైనా బుద్ది చెప్పాలి అనుకున్నాడు. ఆ మర్నాడు కూడా గాడిద సంతకు వెళ్లి, తిరిగి వస్తూ, అలవాటుగా వీపు మీది మూటలను నీళ్లలో పడేసింది. కానీ నీటిలో నుంచి పైకి లేచి చూస్తే, మూటలు అంతకు ముందు కంటే ఇంకా బరువు ఎక్కువై గాడిద కదలలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే, ఆ రోజు గాడిద బధ్దకానికి సరైన బుధ్ది చెప్పాలని, రాజు దాని వీపు మీద పత్తి మూటలు వేయించాడు. అవి నీటిలో తడిసి ఇంకా ఎక్కువ బరువు అయ్యాయి. ఈ విషయం తెలుసుకుని అలా బుధ్ది తెచ్చుకున్న గాడిద ఆ రోజు నుండి యజమాని చెప్పిన పని చక్కగా చేస్తూ చురుకుగా ఉంది.
Updated Date - Sep 03 , 2024 | 12:34 AM